24 గంటల్లో 132 కరోనా కేసులు... శ్రీకాకుళంలో అత్యధికం, ఏపీలో 20,72,213కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Dec 14, 2021, 05:51 PM IST
24 గంటల్లో 132 కరోనా కేసులు... శ్రీకాకుళంలో అత్యధికం, ఏపీలో 20,72,213కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 132 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 186 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,823 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 132 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,72,213కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,468కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,55,922కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 29,228 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,08,27,634కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1823 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 7, చిత్తూరు 6, తూర్పుగోదావరి 13, గుంటూరు 14, కడప 4, కృష్ణ 11, కర్నూలు 1, నెల్లూరు 5, ప్రకాశం 5, శ్రీకాకుళం 36, విశాఖపట్నం 19, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 9 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
పోలీసులపై రాజకీయ కక్షలా? వైసీపీకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హోంమంత్రి అనిత | Asianet News Telugu