చంద్రబాబు దూకుడు.. ఈ నెల 5 నుంచి బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం, షెడ్యూల్ ఇదే

Siva Kodati |  
Published : Sep 03, 2023, 08:41 PM IST
చంద్రబాబు దూకుడు.. ఈ నెల 5 నుంచి బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం, షెడ్యూల్ ఇదే

సారాంశం

‘‘బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో ప్రారంభించనున్నారు.  రాయదుగర్గం నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడు పెంచాడు. దీనిలో భాగంగా ‘‘బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ’’ కార్యక్రమాన్ని ఆయన ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. అనంపురం జిల్లా రాయదుగర్గం నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది. 5, 6, 7 తేదీల్లో రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ప్రజలతో చర్చా కార్యక్రమాలు , సమావేశాలు, రోడ్ షోలు, సభల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం 8, 9 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. 

5వ తేదీ నాడు మధ్యాహ్నం 1 గంటకు బళ్లారి చేరుకుని అక్కడి తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి రాయదుర్గం వెళతారు. బాబు ష్యూరిటీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు, ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 

Also Read: అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం.. జగన్ పై చంద్రబాబు ఫైర్

అంతకుముందు జగన్ పాలనలో కరెంటు కోతలతో  రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు  విమర్శించారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు. తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. కాకినాడ లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు  మాట్లాడుతూ జగన్ పాలనలో కరెంటు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, వైసీపీ నేతలకు ప్రజల సంక్షేమం కన్నా.. వారి వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో రూ. 40000 కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దొంగలు పెరిగారని, ఇసుక దొరక్క పేదలు ఇల్లు కట్టుకోలేకపోతున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చే వాళ్ళమని గుర్తు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu