ఘనంగా వంగవీటి రాధాకృష్ణ ఎంగేజ్‌మెంట్.. పెళ్లికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే..?

Siva Kodati |  
Published : Sep 03, 2023, 07:27 PM IST
ఘనంగా వంగవీటి రాధాకృష్ణ ఎంగేజ్‌మెంట్.. పెళ్లికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే..?

సారాంశం

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఎంగేజ్‌మెంట్ ఆదివారం ఘనంగా జరిగింది.  అక్టోబర్ 22న సాయంత్రం 7 రాధా - పుష్పవల్లిల వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. నిశ్చితార్ధ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఎంగేజ్‌మెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపపురం మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో రాధా వివాహాన్ని పెద్దలు నిశ్చయించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 22న సాయంత్రం 7 రాధా - పుష్పవల్లిల వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. నిశ్చితార్ధ వేడుకకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరావు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ నరసాపురం ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

ఇక, వంగవీటి రంగ కుమారుడిగా వంగవీటి రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. వంగవీటి రాధా 2004లో ఓసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. కొంతకాలం పాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే రాధా పెళ్లి గురించి ఆయన అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పెళ్లికి చేసుకోబోతున్నారనే వార్త వినిపించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations