PM Security Lapse : భద్రతా లోపాలు తీవ్ర ఆందోళనకరం.. చంద్రబాబు

Published : Jan 08, 2022, 12:09 PM ISTUpdated : Jan 08, 2022, 12:31 PM IST
PM Security Lapse :  భద్రతా లోపాలు తీవ్ర ఆందోళనకరం.. చంద్రబాబు

సారాంశం

 భారత ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలు తీవ్ర ఆందోళనకరం అని చంద్రబాబు అన్నారు. దేశ ప్రధాని భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వటర్ వేదికగా ఈ అంశం మీద తన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో జరిగిన ఘటనపై TDP chief చంద్రబాబు ట్వీటర్ వేదికగా ఖండించారు. భారత ప్రధాని punjab  పర్యటనలో Security lapses తీవ్ర ఆందోళనకరం అని చంద్రబాబు అన్నారు. దేశ ప్రధాని భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వటర్ వేదికగా ఈ అంశం మీద తన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, Punjabలో భద్రతా లోపం వల్ల ప్రధాన మంత్రి Narendra Modi బుధవారం 20 నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్‌పై నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తన పర్యటనను రద్దు చేసుకుని అక్కడి నుంచి వెనక్కి రావల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఈ సందర్భంగానే తాజాగా, పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పంజాబ్ ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి కమిటీ వేయవద్దని కేంద్రం వాదించింది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రావెల్ రికార్డులు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశిస్తూ.. ఆ రికార్డులు అన్ని తమ కస్టడీలో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆ రిజిస్ట్రార్ జనరల్‌కు పంజాబ్ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), ఇతర కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలూ సహకరించాలని తెలిపింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సహకరించాలని, అవసరమైన సహాయాన్ని అందించాలని కోరింది.

పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీపై యాక్షన్ తీసుకోవాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ బహిరంగ పిలుపు ఇచ్చిందని, ఇది అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రలో భాగంగా జరిగి ఉండవచ్చనీ సొలిసిటర్ జనరల్ వాదించారు. అందుకే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ప్రధాని మోడీకి భద్రతా వైఫల్యం ఘటనపై దర్యాప్తు చేయరాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రత్యేకంగా కమిటీ వేయరాదని కోరారు. ఇది కేవలం న్యాయాన్ని తప్పు పట్టే ప్రయత్నంగానూ ఉండవచ్చని అన్నారు. ప్రధాని మోడీ భద్రతా లోపం ఘటనపై దర్యాప్తులో కచ్చితంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉండాలని వాదించారు.

ప్రధాన మంత్రికి భద్రతా వైఫల్యం కలగడం అరుదుల్లోకెల్ల అరుదు అని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీసే విషయంగా ఉన్నదని పేర్కొంది. అంతేకాదు, ఈ ఘటనను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సమర్థించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదించారు. ప్రధాన మంత్రి భద్రతకు సంబంధించి తీవ్ర పరిస్థితులను ఈ ఘటన ప్రేరేపించిందని ఆయన కోర్టులో అన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్