బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చి.. తెలంగాణకు చెందిన కుటుంబం ఆత్మహత్య (వీడియో)

Published : Jan 08, 2022, 11:44 AM ISTUpdated : Jan 08, 2022, 11:57 AM IST
బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చి.. తెలంగాణకు చెందిన కుటుంబం ఆత్మహత్య (వీడియో)

సారాంశం

ఈ కుటుంబం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాల మీద పోలీసులు విచారణ చేపట్టారు. నదిలో గల్లంతైన వారి మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. మృతులు పప్పుల సురేష్ (54), సురేష్ భార్య శ్రీలత, కుమారులు ఆశిష్,అఖిల్ గా గుర్తించారు. కాగా సూసైడ్ గల కారణాలు తెలుసుకునే పనిలో బెజవాడ పోలీసులు మునిగిపోయారు.

విజయవాడ : Vijayawadaలో ఓకే కుటుంబానికి చెందిన నలుగురు suicide చేసుకోవడం కలకలం రేపింది. బెజవాడ కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా,  Krishna riverలో దూకి తండ్రీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కుటుంబం దుర్గమ్మ దర్శనానికి వచ్చి సూసైడ్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

"

ఈ కుటుంబం telangana ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాల మీద పోలీసులు విచారణ చేపట్టారు. నదిలో గల్లంతైన వారి dead bodyల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. మృతులు పప్పుల సురేష్ (54), సురేష్ భార్య శ్రీలత, కుమారులు ఆశిష్,అఖిల్ గా గుర్తించారు. కాగా సూసైడ్ గల కారణాలు తెలుసుకునే పనిలో బెజవాడ పోలీసులు మునిగిపోయారు.

విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకుపాల్పడటం కలకలం రేపింది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వీరు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకాపరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా.. తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకారు.  కృష్ణా నదిలో దూకిన తండ్రి, కుమారుడి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు. మృతులను తెలంగాణలోని నిజమాబాద్‌ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. 

కన్యకాపరమేశ్వరి సత్రంలో రిజిస్టర్ చేసిన వివరాల ప్రకారం మృతులను సురేష్, అతని భార్య శ్రీలత, కొడుకులు అశిష్, అఖిల్‌గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.మృతులు ఈ నెల 6వ తేదీ సాయంత్రం కన్యకాపరమేశ్వరి సత్రంలో రూమ్ తీసుకున్నట్టుగా సత్రం నిర్వాహకులు తెలిపారు. 
 
‘ఈరోజు ఉదయం నిజమాబాద్‌ నుంచి మృతులకు సంబంధించి వారు ఫోన్ చేసి.. సత్రంలో దిగిన మా వాళ్లు ఆత్మహత్య చేసుకోబోతున్నారని తెలిపారని చెప్పారు. దీంతో వెంటనే సత్రం మేనేజర్ శ్రీధర్.. ఈ విషయాన్ని సత్రం చైర్మన్‌కు తెలియజేశారు. వెంటనే వారు ఉంటున్న రూమ్ వద్దకు వెళ్లి చూడగా.. శ్రీలత, అశిష్‌లు మంచంపై చనిపోయి కనిపించారు’ అని పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనను అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్టుగా పోలీసులు చెప్పారు. నిజామాబాద్ నుంచి వారి బంధువులు వచ్చిన తర్వాత వారి నుంచి సమాచారం సేకరించి విచారణను కొనసాగిస్తామని తెలిపారు. 

ఇదిలా ఉండగా, Karimnagar జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివారులో గల గుట్టలో Young woman brutally murderకు గురైంది. యువతి dead bodyని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

కాగా యువతి హత్యకు love affair కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతికి.. పక్క గ్రామమైన పోరండ్ల గ్రామానికి చెందిన ఆశోద అకిల్ అనే యువకుడితో గత ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కాగా వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే వీరి పెళ్లికి మైనర్ అనేది అడ్డు వచ్చింది. దీంతో రెండు సంవత్సరాలుగా ఇద్దరు దూరంగా ఉంటున్నారు. కాగా, ఇటీవల ప్రేమికుడు మళ్లీ అమ్మాయికి దగ్గరయ్యాడు. మాటలు కలుపుతూ మెల్లిగా అమ్మాయిని లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఆమెను పథకం ప్రకారం హత్య చేశాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu
ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న Sai Reddy | Vijay Saireddy Press Meet | Asianet News Telugu