Childrens Day: వారు రోడ్డునపడకుండా వుండేందుకు... నేనే రోడ్డెక్కుతా: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Nov 14, 2021, 1:53 PM IST
Highlights

రాష్ట్రంలోని బాలబాలికలందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూనే విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకునేలా వ్యవహరిస్తున్నారంటూ జగన్ సర్కార్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలల దినోత్సవం రోజున చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మరోసారి రోడ్డెక్కడానికి సిద్దమేనని ఆయన ప్రకటించారు.   

''చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మనం మన వర్తమానాన్ని త్యాగం చేసినట్లయితే, మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలం అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం. అలాంటిది ఈరోజు ఎయిడెడ్ పాఠశాలల ఆస్తుల కోసం విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది'' అని chadrababu naidu ఆందోళన వ్యక్తం చేసారు. 

''గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలల హక్కుల పరిరక్షణ కోసం ‘భారత యాత్ర’ చేపట్టిన కైలాశ్‌ సత్యార్థితో పాటు... నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీధుల్లో పాదయాత్ర చేసాను. ఇప్పుడు కూడా అవసరమైతే పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం మళ్ళీ మళ్ళీ రోడ్డు మీదకు వస్తాను. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత విలువైన వనరులు బాలలే. వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత మనదే. జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా పిల్లల హక్కుల పరిరక్షణకు, లైంగిక దాడుల నుంచి వారిని కాపాడేందుకు మనందరం కలసికట్టుగా కృషి చేసేందుకు ప్రతిన తీసుకుందాం'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

read more  ఎయిడెడ్ సంస్థల విలీనం : ‘తన తప్పులు తానే బయటపెట్టుకునే గొప్పతనం జగన్ రెడ్డిది’.. నారా లోకేష్ ఎద్దేవా..

ఇక చంద్రబాబు తనయుడు, TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూనే aided విద్యాసంస్థల వివాదంపై స్పందించారు. ''పిల్లలకు ఏ మేలు చేసినా అది మొత్తం సమాజానికి చేసినట్లే అన్నారు గౌతమ బుద్ధుడు. అలాంటిది ఇప్పటి ప్రభుత్వానికి పిల్లలను చదివించడమే మోయలేనంత భారమైపోయింది. అందుకే ఎయిడెడ్ స్కూళ్లపై వాళ్ళ కన్ను పడింది. బడి కోసం, భవిష్యత్తు కోసం పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళను కొట్టిస్తున్నారు'' అని lokesh ఆందోళన వ్యక్తం చేసారు.

''బాల్యం దాటకుండానే మనమంతా పెద్దవాళ్ళం అయిపోయామా? అలాంటప్పుడు పిల్లల సమస్యలు ఎందుకు పట్టించుకోరు? తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేకపోయినా పిల్లల భవిష్యత్తు పట్ల ఎల్లప్పుడూ బాధ్యతగా ఉంటుంది. చిన్నారులందరికీ national childrens day శుభాకాంక్షలు'' అని లోకేష్ పేర్కొన్నారు. 

read more  అనంతపురం విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్... జగన్ పై లోకేష్ సీరియస్ (వీడియో)

ఇదిలావుంటే ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఓవైపు రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతుంటే మరోవైపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలుచేసే దిశగా మరో ముందడుగు వేసింది. విలీనానికి సంబంధించి ఏపీ విద్యాశాఖ అంతర్గత మెమో జారీ చేసింది. 2249 ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 68.78 శాతం విద్యాసంస్థలు విలీనానికి అంగీకరించాయని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. 702 ఎయిడెడ్ విద్యాసంస్థలు అంగీకరించలేదని తెలిపింది. 

ఇదే సమయంలో తాము ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఒత్తిడి పెట్టలేదని.. విలీనానికి 4 ఆప్షన్లు ఇచ్చినట్లు వెల్లడించింది. ఆప్షన్లలో ఏదోఒకటి ఎంపిక చేసుకుని విలీనం చేసే అవకాశాన్ని ఎయిడెడ్ విద్యాసంస్థలకు కల్పించామన్నారు.  ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలుగా కొనసాగడం, విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం వంటి ఆప్షన్లు కూడా ఇచ్చామన్నారు. 


 

click me!