గవర్నర్‌తో చంద్రబాబు భేటీ: జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు

By Siva KodatiFirst Published Jan 24, 2020, 5:05 PM IST
Highlights

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లు సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను చంద్రబాబు.. గవర్నర్‌కు వివరించడంతో పాటు వైసీపీ సభ్యులు, మంత్రుల తీరుపై ఫిర్యాదు చేశారు. 

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లు సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను చంద్రబాబు.. గవర్నర్‌కు వివరించడంతో పాటు వైసీపీ సభ్యులు, మంత్రుల తీరుపై ఫిర్యాదు చేశారు.

అలాగే మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై ఆంక్షలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అంతముందు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీలకు భరోసానిచ్చారు.

Also Read:మండలి రద్దు భయం వద్దు: ఎమ్మెల్సీలకు చంద్రబాబు భరోసా

మండలి ఎట్టి పరిస్ధితుల్లోనూ రద్దు కాదని తెలిపారు. సభలో మొదటి రోజు మొత్తం తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. స్పీకర్‌కు స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి ప్రతిపక్షాన్ని బయటకు నెట్టామన్నారని బాబు ఎద్దేవా చేశారు.

కౌన్సిల్‌ గ్యాలరీలో కూర్చొన్న తనను బయటకు పంపించే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్‌ను ఆయన రూంలోనే కొట్టేందుకు యత్నించారని చంద్రబాబు ఆరోపించారు. తీవ్రవాద గ్రూప్‌ల నుంచి తీసుకువచ్చి సీతక్క, పోతుల సునీతకు టిక్కెట్లు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు.

Also Read:ప్రాసెస్ పూర్తి కాలేదు, ట్విస్టిచ్చిన షరీఫ్: టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ

పోతుల సునీతకు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని.. ఓడిపోతే ఎమ్మెల్సీని చేశామని, ఆమెకు ఎం తక్కువ చేశామని బాబు ప్రశ్నించారు. మండలిలో మెజారిటీ ఉందని తమకు ముందే తెలుసునని, 9 మందితో గెలుస్తామని ఎలా అనుకున్నారని ఆయన అన్నారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేకపోతే మూడు రాజధానులు బిల్లు ఎందుకు పెట్టారని బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. 

click me!