పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లులు ఇంకా సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదనే శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్ ప్రకటించారు.
అమరావతి: ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగితేనే బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తాయని శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ చెప్పారు.
Also read:అందుకే శాసన మండలి రద్దు ఆలోచన: బొత్స సంచలనం
ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని తనకున్న విచక్షణాధికారంతో శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు. ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టుగా శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్ ప్రకటించడంతో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు నియామకమే తరువాయి అనే ధోరణిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం సెలెక్ట్ కమిటీకి వెళ్లే ప్రక్రియ కూడ పూర్తి కాలేదని చెబుతోంది. సెలెక్ట్ కమిటీకి ఈ రెండు బిల్లులను పంపే విషయంలో ఓటింగ్ కూడ జరగలేదని, ఈ ప్రక్రియ పూర్తి కాలేదని ప్రభుత్వం వాదిస్తోంది.
సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు ఇచ్చిన నోటీసులపై టెక్నికల్ సమస్యలు తలెత్తిన కారణంగా శాసనమండలి ఛైర్మెన్ తనకు ఉన్న విచక్షణ అధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపారు.
అయితే సెలెక్ట్ కమిటీకి ఈ రెండు బిల్లులు పంపే ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదని షరీఫ్ తేల్చి చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తైతేనే సెలెక్ట్ కమటీకి పంపే అవకాశం ఉంటుందని మండలి ఛైర్మెన్ ప్రకటించారు.
ఈ రెండు బిల్లులు శాసనమండలి పరిధిలోనే ఉన్నాయనే అర్ధం వచ్చేలా మండలి ఛైర్మెన్ షరీఫ్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. తనకు ఉన్న విచక్షణ అధికారంతోనే తాను సెలెక్ట్ కమిటీకి పంపినట్టుగా షరీఫ్ వివరణ ఇచ్చారు.