Chandrababu fire on Justice Chandru : వీళ్లంతా పేటీఎం బ్యాచ్.. జ‌స్టిస్ చంద్రుపై చంద్ర‌బాబు ఫైర్ ..

By Rajesh KFirst Published Dec 15, 2021, 4:35 PM IST
Highlights

ఏపీ హైకోర్టుపై మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం మారిన విష‌యం తెలిసిందే.. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు కూడా ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ లో పదవులు ఆశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఆరోపించారు.  
 

Chandrababu fire on  Justice Chandru :  ‘జై భీమ్’ సినిమా ద్వారా గుర్తింపు పొందిన జస్టిస్ చంద్రుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను ఉద్దేశించి తమిళనాడు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. 
తాజాగా..  జస్టిస్ చంద్రు  వ్యాఖ్యలపై  ఏపీ మాజీ సీఎం, టీపీడీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. నేడు చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రు వ్యాఖ్యలపై స్ట్రాంగ్ గా రిప్లే ఇచ్చారు. 

పొరుగు రాష్ట్రానికి చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తికి ఇక్కడకొచ్చి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమేముంద‌ని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ జ‌గన్ స‌ర్కార్ ను మెచ్చుకుంటూ.. ఏపీ హైకోర్టుపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు. రిటైర్ అయిన తర్వాత వీళ్లకు పదవులు కావాలి. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 

Read Also : సినిమా టికెట్ల ధరలు .. జీవో నెంబర్ 35 రద్దు: హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు జగన్ సర్కార్

ఏపీలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా..? రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్‌లుగా తయారయ్యారని.. ఏపీలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా..! అని విమ‌ర్శించారు. ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయ వచ్చా..? అని ఆగ్రహాం వ్యక్తం చేశారు.  

Read Also : సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు అన్ని హ‌క్కులు క‌ల్పించాలి - సుప్రీంకోర్టు

కాగా.. గత కొద్దిరోజులుగా చంద్రు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగానే మారాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా స్పందించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వ్య‌తిరేకించారు. ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని ఈ సందర్భంగా చంద్రుపై దేవానంద్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Read Also : ఈ ఆకురౌడీలు నాకో లెక్కకాదు... వారి కథ తేలుస్తా..: వైసిపి నాయకులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్


ఇంతకీ చంద్రు ఏమన్నారంటే...? 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హై కోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో వార్ చేస్తోంద‌ని అన్నారు. అంతేకాదు.. అమరావతి భూస్కామ్‌లో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.

click me!