వైసీపీ (ysrcp) ప్రభుత్వ తీరుపై టీడీపీ (tdp) విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ( velagapudi rama krishna babu) మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముడసర్లోవ వద్ద రూ. 8.20 కోట్ల వ్యయంతో ట్రాన్సిట్ హాల్ట్ ను (transit halt) ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
వైసీపీ (ysrcp) ప్రభుత్వ తీరుపై టీడీపీ (tdp) విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ( velagapudi rama krishna babu) మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముడసర్లోవ వద్ద రూ. 8.20 కోట్ల వ్యయంతో ట్రాన్సిట్ హాల్ట్ ను (transit halt) ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఆధునిక యంత్రాలతో చెత్త నుంచి కంపోస్టు తయారీ, మిగిలిన చెత్తను కాపులుప్పాడ యార్డుకు తరలించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశామని వెలగపూడి తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ కు నిధులు ఇవ్వకుండా... చివరకు చెత్త డంపింగ్ యార్డుగా మార్చేశారని రామకృష్ణబాబు మండిపడ్డారు.
ఈ డంపింగ్ యార్డు వల్ల ముడసర్లోవ రిజర్వాయర్ జలాలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయని వెలగపూడి ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ వల్ల స్థానికుల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించకుండా... ప్రతిపక్ష నేతల మాదిరి అధికారులకు వినతిపత్రాలను ఇస్తున్నారని రామకృష్ణ బాబు విమర్శించారు.
undefined
Also Read:ఈ ఆకురౌడీలు నాకో లెక్కకాదు... వారి కథ తేలుస్తా..: వైసిపి నాయకులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
అంతకుముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో (NTR Bhavan) నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల (nellore corporation election)పై చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. ఎంతమందిని చంపుతారు... ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారని వైసిపి (ycp) పార్టీని నిలదీసారు.
''నా 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశా...పెద్దపెద్ద గూండాలను చూశా...నెల్లూరులో ఇప్పుడున్న ఆకురౌడీలు నాకో లెక్కకాదు... వారి కథ తేలుస్తా... ధైర్యంగా ఉండండి... ఆకురౌడీలకు భయపడకండి...నేనున్నాను. టిడిపిది 70లక్షల సైన్యం...అందరం కలసికట్టుగా తిరగబడితే పారిపోతారు...ఎవరూ భయపడొద్దు'' అని చంద్రబాబు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.