ఖరారైన అపాయింట్‌మెంట్.. రేపు చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు భేటీ, 22న టీడీపీలోకి ..?

Siva Kodati |  
Published : Aug 19, 2023, 09:32 PM IST
ఖరారైన అపాయింట్‌మెంట్.. రేపు చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు భేటీ, 22న టీడీపీలోకి ..?

సారాంశం

యార్లగడ్డ వెంకట్రావుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ ఖరారు అయ్యింది. ఆదివారం ఉదయం 11 హైదరాబాద్‌లో బాబును యార్లగడ్డ కలవనున్నారు. ఈ నెల 22న గన్నవరంలో జరిగే సభలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరుతారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పడం.. తనకు అవకాశమిస్తే టీడీపీలో పోటీ చేస్తానని ప్రకటించడం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది. తాను చంద్రబాబు నాయుడు అపాయింట్ కోరానని.. ఆయన అవకాశమిస్తే కలుస్తానని వెంకట్రావు చెప్పారు. ఈ క్రమంలో ఆయనకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఆదివారం ఉదయం 11 హైదరాబాద్‌లో బాబును యార్లగడ్డ కలవనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్‌కు బయల్దేరినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 22న గన్నవరంలో జరిగే సభలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరుతారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

కాగా..  శుక్రవారంనాడు  విజయవాడలో  అనుచరులతో  యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమెరికా నుండి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు  చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. వైసీపీలో  తనకు అవమానాలు జరిగాయని చెప్పారు. మూడు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి  చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కల్గించాయన్నారు.  ఈ సమావేశంలో ప్రసంగిస్తూనే  టీడీపీ చీఫ్ చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు.

ALso Read : యార్లగడ్డను పోతే పోని అని నేను అంటానా.. ఆయనను ఎవ్వరూ అవమానించలేదు : సజ్జల కౌంటర్

తాను పనికి వస్తానని భావిస్తే వచ్చే ఎన్నికల్లో తనకు  గన్నవరం నుండి టిక్కెట్టు ఇవ్వాలని  యార్లగడ్డ వెంకటరావు  చంద్రబాబును కోరారు. గత ఎన్నికల్లో  తనకు వైసీపీ టిక్కెట్టు ఇచ్చినందుకు జగన్ కు  ధన్యవాదాలు  చెప్పారు. గన్నవరం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని యార్లగడ్డ వెంకటరావు  విశ్వాసం వ్యక్తం  చేశారు. 2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి  యార్లగడ్డ వెంకటరావు పోటీ చేశారు.  

అయితే టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ చేతిలో యార్లగడ్డ వెంకటరావు స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు.  ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీకి మద్దతు పలికారు. దీంతో  వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు వర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. ఈ విషయమై  ఇరు వర్గాల మధ్య రాజీకి పార్టీ నాయకత్వం   ప్రయత్నించింది.
 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu