గ్రోత్ సెంటర్ భూముల వ్యవహారం.. జీవో ఇచ్చింది టీడీపీయే, రామోజీరావుకు బొత్స సవాల్

By Siva KodatiFirst Published Aug 19, 2023, 6:42 PM IST
Highlights

గ్రోత్ సెంటర్ భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మాకు ఇచ్చిన భూములు అవసరమైతే అదే రేటుకు రామోజీకి కూడా ఇస్తామని.. అక్కడే పరిశ్రమ పెట్టాలని మంత్రి సవాల్ విసిరారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామోజీలా దోచుకోవడం, పేదవారి రక్తం తాగే అలవాటు తనకు లేదన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీల మీద భూమిని కేటాయిస్తోందని.. గ్రోత్ సెంటర్ ద్వారా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోందని బొత్స తెలిపారు. మాకు ఇచ్చిన భూములు అవసరమైతే అదే రేటుకు రామోజీకి కూడా ఇస్తామని.. అక్కడే పరిశ్రమ పెట్టాలని మంత్రి సవాల్ విసిరారు. గ్రోత్ సెంటర్ భూములకు టీడీపీ ప్రభుత్వమే జీవో ఇచ్చిందని.. ముగ్గురు మూడు దిక్కులు తిరుగుతూ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై విమర్శలు గుప్పించారు. 

ALso Read: వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోంది: ప‌వ‌న్ క‌ళ్యాణ్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని.. తాము హోదాను తాకట్టు పెట్టలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు పాలన ఎంత బాగుందో పవన్ చెప్పాలని.. పచ్చ కామెర్లు వున్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. రుషికొండలో నిబంధలనకు అనుగుణంగానే ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని.. ఈ విషయాన్ని ఏడాది క్రితమే కెప్పానని బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం , సంక్షేమ రంగాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి వెల్లడించారు. చంద్రబాబులా దళారులను పెట్టి దోచుకోలేదని బొత్స సత్యనారాయణ చురకలంటించారు. జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజల సోమ్ములను దోచుకున్నారని మంత్రి ఆరోపించారు.

click me!