రేపు విశాఖ పర్యటనకు జగన్.. వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ తర్వాత తొలిసారి

Siva Kodati |  
Published : Dec 16, 2021, 07:40 PM IST
రేపు విశాఖ పర్యటనకు జగన్.. వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ తర్వాత తొలిసారి

సారాంశం

రేపు విశాఖపట్నంలో (visakhapatnam) సీఎం  వైఎస్‌ జగన్‌ (ys jagan) పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవం, ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు (venkaiah naidu) మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్నారు సీఎం

రేపు విశాఖపట్నంలో (visakhapatnam) సీఎం  వైఎస్‌ జగన్‌ (ys jagan) పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవం, ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు (venkaiah naidu) మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్నారు సీఎం. శుక్రవారం సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విశాఖ బయలుదేరనున్నారు జగన్. 5.20 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్న సీఎం 

6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్‌కు హాజరవనున్నారు ముఖ్యమంత్రి. 6.20 గంటలకు ఉడా పార్క్‌ వద్ద ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు సీఎం జగన్. సాయంత్రం 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు జగన్ . అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి తిరిగి గన్నవరం చేరుకోనున్నారు. 

ALso Read:Three Capitals Bill: మూడు రాజధానులపై జగన్ ఎందుకు వెనక్కి తగ్గారు?.. మరో బిల్లు ఇప్పట్లో లేనట్టేనా?

అయితే జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కారణం రాజధాని అంశం. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి తీవ్రంగా ప్రయత్నించారు కూడా. అయితే ఇంతలోనే కోర్టు జోక్యంతో మూడు రాజధానుల బిల్లును జగన్  అసెంబ్లీ సాక్షిగా వెనక్కు తీసుకున్నారు. ఆ బిల్లు ఉపసంహరణ తరువాత తొలిసారి విశాఖలో అడుగుపెడుతున్నారు. మరి జగన్ రాజధానిపై క్లారిటీ ఇస్తారా... విశాఖ ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్