జనాలకు మొదలైన మద్దెల దరువు

Published : Sep 11, 2017, 01:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
జనాలకు మొదలైన మద్దెల దరువు

సారాంశం

జనాలకు కొద్ది రోజుల పాటు మద్దెల దరువు ఖాయం. ఎందుకంటే, అధికార, ప్రధాన ప్రతిపక్షాలు రెండు పరస్పర విరుద్ధమైన కార్యక్రమాలను ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టాయి. తమ కార్యక్రమాల్లో భాగంగా రెండు పార్టీల నేతలు జనాల ఇళ్ళకు వెళ్ళల్సిందే. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవటానికి రెండు పార్టీల నేతల కుడా జనాల చుట్టూ తిరగనున్నారు.

జనాలకు కొద్ది రోజుల పాటు మద్దెల దరువు ఖాయం. ఎందుకంటే, అధికార, ప్రధాన ప్రతిపక్షాలు రెండు పరస్పర విరుద్ధమైన కార్యక్రమాలను ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టాయి. తమ కార్యక్రమాల్లో భాగంగా రెండు పార్టీల నేతలు జనాల ఇళ్ళకు వెళ్ళల్సిందే. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవటానికి రెండు పార్టీల నేతల కుడా జనాల చుట్టూ తిరగనున్నారు. ఎలాగంటే, ఇరుపార్టీల నేతలు ఒకేసారి ఒకేసమయంలో ఒకే ఇంటికో లేకపోతే ఒకే వీధిలోనో తారసపడితే మాత్రం ఇబ్బందులు తప్పవు.

రెండు పార్టీలు జనాల్లోకి వెళ్ళటానికి వీలుగా కార్యక్రమాలను సోమవారమే మొదలుపెట్టటంతో రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయానికి తెరలేచింది. వైసీపీ మొదలుపెట్టిన ‘‘వైఎస్సాఆర్ కుటుంబం’’ కార్యక్రమం చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశించింది. అదే సమయంలో టిడిపి కుడా ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమాన్ని ప్రారంబించింది. రెండు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మొదలయ్యాయి.

వైసీపీ కార్యక్రమంలోనైనా, టిడిపి కార్యక్రమంలోనైనా నేతలు, కార్యకర్తలు జనాల ఇళ్ళకు వెళ్ళాలి. అందులో వైసీపీ ఏమో చంద్రబాబు ప్రజా వ్యతిరేకపాలనపై జనాల్లో చైతన్యం తేవటానికి ప్రయత్నిస్తామని చెబుతున్నది. చంద్రబాబు పాలనసై నూరుప్రశ్నలతో ఓ ప్రశ్నాపత్రాన్ని రూపొందించి ప్రజల అభిప్రాయాలను సమాధానాల రూపంలో రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ వరకూ జరుగుతుంది.

అదే సమయంలో సమస్యలే లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే ఉద్దేశ్యంగా  చంద్రబాబునాయుడు ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళంలోని పాలకొండ నియోజకవర్గంలో చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు తమ పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నదీ లేనిది తెలుసుకోవటం ముఖ్య ఉద్దేశ్యంగా కార్యక్రమాన్ని రూపొందించారు. పనిలో పనిగా జనాల అవసరాలను కుడా నేతలు తెలుసుకుంటారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమం కుడా 50 రోజులు జరుగుతుంది. చూడాలి ఎవరి కార్యక్రమాన్ని జనాలు ఆధరిస్తారో.

 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwara Darshanam: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu