రోజా మాటలు వినొద్దు... పురందేశ్వరిని చూడండంటున్న మంత్రి

First Published Sep 11, 2017, 7:57 AM IST
Highlights

బిజెపి పురందేశ్వరి చంద్రబాబు వ్యతిరేకి

జగన్ ను ఏన్నో సార్లు ప్రశంసించారు

అయితే, ఆమెనే చూసి నేర్చుకోమంటున్నారు బిజపి మంత్రి మాణిక్యాలరావు

వైసిసి నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజాకు, బిజెపి సినియర్ నాయకురాలు పురందేశ్వరికి తేడా ఏమిటి?

రాష్ట్రదేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు జవాబు చెప్పారు. కాకినాడలో బిజెపితరఫున నిలబడి గెలిచిన మహిళాకార్పొరేటర్లకు ఆయన ఈ విషయంలో హిత బోధ చేశారు. రాజకీయాల్లో రాణించాలనుకుంటే ఈ తేడా గమనించాలని ఆయన  మహిళా కార్పొరేటర్లు నల్లబిల్లి సుజాత, గోడి సత్యవతి, సాలిగ్రామ లక్ష్మీప్రసన్నలకు ఆదివారం నాడు ఏర్పాటు చేసిన ఒక సన్మాన సభలో సూచించారు. రాజకీయాలలో బాగా రాణించాలనుకునే ఈ ఇద్దరు మహిళలను పోల్చుకోవాలని అన్నారు.

మహిళలు ఎలా ఉండరాదో, ఎలా మాట్లాడరాదో వైసిపి ఎమ్మెల్యే రోజాను చూసి నేర్చుకోండి, అదే విధంగా ఎలా మాట్లాడాలో బిజెపి నేత పురందేశ్వరిని చేసి ఫాలో కావాలి, అని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.అయితే, మంత్రి గారి మాటల్నే తీసుకుంటే రాజకీయాల్లో నిజంగా ఇపుడు రాణిస్తుది రోజాయే. 2014 ఎన్నికల్లో టిడిపి హవాను తట్టుకుని రోజా అసెంబ్లీ కి గెల్చారు. పురందేశ్వరి రాజంపేట నుంచి లోక్ సభ కు పోటీ చేసి ఓడిపోయారు. దానికి తోడు ఆమె వైసిపి నేత జగన్ అభిమాని. ఆ మధ్య జగన్ నాయకత్వాన్ని ప్రశంసించారు కూడా. మరీ ముఖ్యంగా పురందేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏకిపారేసే బిజెపి నాయకులలో  ఒకరు. బిజెపి టిడిపి ఆంధ్రలో చెట్టా పట్టాలేసుకుని పోతే, ఆమె మరికొందరితో కలసి వైసిసిలో కూడా చేరవచ్చని ఆ మధ్య వూహగానాలు కూడా మీడియాకెక్కాయి. మరి మంత్రి మాణిక్యాల రావు  చెబుతున్నట్లు  బిజెపి మహిళా కార్పొరేటర్లు పురుందేశ్వరిని అనుకరించడమంటే అర్థమేమిటో?

వీరిద్దరి మాటలు చూస్తే రాజకీయాల్లో ఉన్న వాళ్లు ఎలా ప్రవర్తించాలో ప్రజలకు అట్టే అర్థమవుతుందని మంత్రి చెప్పారు.  కాకినాడలో మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోముగ్గురు బిజెపి మహిళా కార్పొరేటర్లు గెలుపొందటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ ముగ్గురు మహిళల గెలపు  బిజపి  విజయ పథానికి నాంది అని అన్నారు. రానున్న ఎన్నికల్లో  జిల్లాలోని అసెంబ్లీ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళ కార్పొరేటర్లుకు ఎలా ప్రవర్తించాలో ఆయన హితబోధ చేసిన పందర్భం ఇదే.

అయితే మంత్రి మాణిక్యాలరావు రోజా విషయంలో టిడిపి నేత  లాగా మాట్లాడితే సభలోనే ఉన్న బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం తన ధోరణి నిజమయిన బిజెపి నేతలాగా మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన ప్రకటించేశారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నుంచి బిజెపి అభ్యర్థులు స్వతంత్రంగా రంగంలోకి దిగుతారని, బిజెపి ఒంటరిగా పోటీ చేసే స్థాయికి ఎదుగుతుందని,అది తథ్యమని అన్నారు.

click me!