
తమిళనాడు రాజకీయాలు కోర్టు మెట్లెక్కాయి. ముందే చెప్పినట్లుగా భాజపా ఎంపి సుబ్రమణ్యన్ స్వామి సుప్రింకోర్టులో గవర్నర్ కు వ్యతరేకంగా కేసు దాఖలు చేసారు. అయితే, అదే అంశంపై శశికళ కూడా చెన్నై హై కోర్టులో కేసు దాఖలు చేయటం గమనార్హం. మెజారిటీ ఎంఎల్ఏల మద్దతున్నప్పటికీ గవర్నర్ శశికళను సిఎంగా ప్రమణ స్వీకారం చేయించేందుకు అంగీకరించటం లేదు. అదే అంశంపై పిటీషనర్లు న్యాయస్ధానాలను ఆశ్రయించారు. తాజా కేసులతో తమిళరాజకీయాలు మరో కీలక మలుపు తిరిగినట్లే. అంటే ఇప్పటి వరకూ గవర్నర్ వద్ద విజ్ఞప్తులకు మాత్రమే పరిమితమైన శశికళ న్యాయపోరాటానికి దిగటం విశేషం.
శశికళను ఎట్టి పరిస్ధితుల్లోనూ ముఖ్యమంత్రిని కానీయకూడదని కంకణం కట్టుకున్న గవర్నర్ ఇపుడు ఎటువంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. వీరిద్దరి పిటీషన్లు గనుక న్యాయస్ధానాలు పరిగణలోకి తీసుకుంటే తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటం ఖాయం. మరి అపుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లేక గవర్నర్ తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.