ఇప్పటికైనా క్లారిటీ ఉందా ?

Published : Feb 13, 2017, 05:41 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఇప్పటికైనా క్లారిటీ ఉందా ?

సారాంశం

ఎవరికైనా అర్ధమవుతోందేమిటంటే పవన్ లో చిన్నపుడే కాదు ఇప్పటికీ ఏ విషయంలోనూ క్లారిటీ లేదని.

ఇంతకీ పవన్ కల్యాణ్ అమెరికాలో ఏమి చెప్పారో ఎవరికైనా అర్ధమైందా? పోనీ తానేమి చెప్పారో ఆయనకైనా అర్ధమైందో లేదో. అమెరికాలోని జాన్ ఎఫ్ కెనెడీ విశ్వవిద్యాలయంలో జూనియర్ ఫోరం నిర్వహించిన సదస్సులో పవన్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు ఇతరులకు అర్ధమవ్వటం మాట పక్కన బెడితే పరస్పర విరుద్ధంగా మట్లాడి యువతను అయోమయంలోకి నెట్టేసారు. అమెరికాలో కాలుపెట్టిన దగ్గర నుండి పలు సందర్భాల్లో పవన్ వరస ఇదే ధోరణిలో సాగుతోంది.

 

తాను చిన్నప్పటినుండే సమాజంలోని రుగ్మతలను పరిశీలిస్తుండేవారట. చిన్నపుడే సమాజంలోని రుగ్మతులపై అంతటి అవగాహన ఉండేవారా? చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం చూపాలని భావించేవారట. మరి ఎందుకు చూపలేదు? అన్యాయానికి పరిష్కారం తీవ్రవాదమే సరైనదని భావించారట. అంతచిన్నపుడే తీవ్రవాదంపై అంతటి పరిజ్ఞానం ఉండటం మామూలు విషయం కాదు. తన వ్యవహారశైలి చూసి తాను నక్సలైట్లలో కలిసిపోతానని ఇంట్లో వాళ్ళు అనుకునేవారట. ఎందుకు కలవలేదో?  ఒకదశలో యోగిగా కూడా మారిపోదామనుకున్నారట.

 

తనకు ఓ తుపాకీ కొనిస్తే తీవ్రవాదం వైపు ఆకర్షితుణ్ణి కాకుండా ఉంటానేమోనని తన అన్నయ్య అనుకున్నావారట. ఏంటి నిజమే? తీవ్రవాద భావాలున్న వ్యక్తికి ఎవరైనా తుపాకి కొనివ్వాలని అనుకుంటారా? చదువులో రాణించలేకపోవటం, డిప్రెషన్లోకి వెళ్లిపోవటం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం, తన అన్నవద్ద ఉన్న లైసెన్స్ తుపాకితో కాల్చుకుందామనుకున్నాట. కంప్యూటర్, యోగ, మార్షల్ ఆర్ట్స్ లాంటి అనేక అంశాలపై ప్రయోగాలు జరిగాయట. తరచూ ఇంట్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చేవారట. అయితే, చదువులో రాణించని కారణంగా వేరే మార్గం లేక సినిమాల్లోకి వచ్చానని పవన కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇంతకీ పవన్ జనాలకు ఏం చెప్పదలచుకున్నారో అర్ధం కావటం లేదు. పోనీ చెప్పిన విషయాలేమైనా కొత్తవా అంటే అదీ కాదు. గతంలో మీడియా సమావేశాల్లో చాలాసార్లు చెప్పేసినవే.

 

అంటే ఎవరికైనా అర్ధమవుతోందేమిటంటే పవన్ లో చిన్నపుడే కాదు ఇప్పటికీ ఏ విషయంలోనూ క్లారిటీ లేదని. సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి నుండి ఎవరైనా యువతకు నాలుగు మంచి మాటలు చెబుతారని ఆశిస్తారు. అంతేకానీ తన చిన్నప్పటి సంగతులు చెప్పి కన్ఫ్యూజ్ చేయటం అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పటి యువతలోని చాలామందిలో తమ జీవితాల పట్ల సరైనా క్లారిటీనే ఉంది. అందునా విదేశాలకు వెళ్ళగలిగారంటేనే భవిష్యత్తుపై క్లారిటీ లేకుండానే ఉంటుందా. అటువంటిది వారిలో మరింత స్పూర్తి నింపాల్సిన వ్యక్తి తనలోని గందరగోళాన్ని వారిలోకి నింపాలని చూడటం మంచిదికాదు.

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu