అధికారుల నిర్లక్ష్యం..పరీక్షల్లో ఫెయిల్: డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య

By Siva KodatiFirst Published Aug 20, 2019, 12:23 PM IST
Highlights

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాక్టీకల్ మార్కులు కలపకుండానే డిగ్రీ ఫలితాలు విడుదల చేశారు అధికారులు. ఈ ఫలితాల్లో దాదాపు 250 మంది విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. పరీక్షల్లో తప్పడంతో హరి అనే విద్యార్ధి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాక్టీకల్ మార్కులు కలపకుండానే డిగ్రీ ఫలితాలు విడుదల చేశారు అధికారులు. ఈ ఫలితాల్లో దాదాపు 250 మంది విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.

పరీక్షల్లో తప్పడంతో హరి అనే విద్యార్ధి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్ధి సంఘాలు వర్సిటీ ముందు ఆందోళనకు దిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఎస్వీయూ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి.

పరీక్షలకు సంబంధించిన ప్రాక్టీకల్ మార్కులను ఆయా కళాశాలల యాజమాన్యాలు వర్సిటీకి పంపాయి. వీటికి థియరీ మార్కులను కలిపి తుది ఫలితాలు విడుదల చేయాల్సి వుంది.

అందుకు తగ్గట్టే కొన్ని కళాశాలల నుంచి వచ్చిన మార్కులను థియరీ మార్కులతో కలిపిన సిబ్బంది.. మరికొన్ని కాలేజీల నుంచి వచ్చిన వాటిని పక్కనబెట్టేయడమే వివాదానికి దారి తీసింది. 

click me!