మిత్రుడిని బాత్‌రూమ్‌లో పెట్టి గొళ్లెం: భయంతో చిన్నారి మృతి

Siva Kodati |  
Published : Aug 20, 2019, 11:39 AM IST
మిత్రుడిని బాత్‌రూమ్‌లో పెట్టి గొళ్లెం: భయంతో చిన్నారి మృతి

సారాంశం

సరదాగా జరిగిన ఆట ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఓ విద్యార్ధి మరో విద్యార్ధినిని ఆట పట్టించేందుకు గాను టాయ్‌లెట్‌లో పెట్టి గొళ్లెం పెట్టాడు. బాత్‌రూమ్‌లోనే ఉన్న విద్యార్ధి భయంతో కేకలు వేస్తూ తలుపులు బాదినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు

సరదాగా జరిగిన ఆట ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ పాఠశాలలో ఈ నెల 14న ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో ఓ విద్యార్ధి మరో విద్యార్ధినిని ఆట పట్టించేందుకు గాను టాయ్‌లెట్‌లో పెట్టి గొళ్లెం పెట్టాడు.

అయితే బడి గంట కొట్టడంతో గొళ్లెం సంగతి మరచిపోయిన ఆ విద్యార్ధి తరగతి గదిలోకి వెళ్లిపోయాడు. బాత్‌రూమ్‌లోనే ఉన్న విద్యార్ధి భయంతో కేకలు వేస్తూ తలుపులు బాదినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.

కాసేపటి తర్వాత అటుగా వెళ్తున్న ఓ మహిళ చిన్నారి అరుపులు విని బాత్‌రూమ్‌ తలుపులు తీసి తరగతి గదిలో వదిలిపెట్టింది. అయితే ఎక్కువ సేపు చీకటిలో ఉండటంతో పాటు గుక్కపట్టి ఏడవటంతో బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.

అయితే ఆ తర్వాతి రోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సైతం చిన్నారి హాజరయ్యాడు. కానీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు బాలుడిని ఈ నెల 17న ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ఈ నెల 18న మరణించాడు. దీంతో బాబు తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళనకు దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర ప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ.. ఇక్కడ చదివితే లక్షల జీతంతో జాబ్ పక్కా..!
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్