సర్వే: వైఎస్ జగన్ ప్రభంజనం, టీడీపీకి షాక్

By pratap reddyFirst Published Nov 2, 2018, 11:37 AM IST
Highlights

ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం వీస్తుందని ఓ సర్వే తేల్చింది. 

న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం వీస్తుందని ఓ సర్వే తేల్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 25 సీట్లలో వైఎస్సార్ కాంగ్రసు పార్టీ 20 స్థానాలు గెలుచుకుంటుదని సర్వే స్పష్టంచేసింది. 

అధికార టీడీపీ 5 స్థానాలకే పరిమితమవుతుందని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే తేల్చింది. నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌ పేరిట తాజా అంచనాల్ని గురువారం విడుదల చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్సీపీ ఈసారి ఆ సంఖ్యను 20కి పెంచుకుంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఈసారి 5 సీట్లకే పరిమితమవుతుందని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి.  2014లో రెండు స్థానాలు దక్కించుకున్న బీజేపీకి ఈసారి ఒక్క సీటు కూడా రాకపోవచ్చునని తెలిపింది. 

ఓట్లశాతం పరంగా చూస్తే వైఎస్సార్సీపీకి 41.2 శాతం, టీడీపీకి 31.2 శాతం, బీజేపీకి 11.3 శాతం, కాంగ్రెస్‌కు 9.3 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. 

click me!