పార్టీలకు పిచ్చెక్కిస్తున్న ‘సర్వే’లు

First Published Jun 12, 2017, 7:20 AM IST
Highlights

ఎవరికి వారు  చేయించుకుంటున్న సర్వేలు కాక మధ్యలో లగడపాటి రాజగోపాల్. ఏమాటకామాటే చెప్పుకోవాలి. లగడపాటి సర్వేలకు విశ్వసనీయత ఎక్కువ. దాంతో లగడపాటి నిజంగా సర్వేలు చేయించారో లేదో తెలీదు గానీ ఆయన చేయించిన సర్వేలంటూ కొన్ని రిపోర్టులు జనాల్లో బాగా ప్రచారంలో ఉన్నాయ్.

‘లగడపాటి సర్వేతో చంద్రబాబుకు చుక్కలు’

‘లగడపాటి సర్వేతో జగన్ కు షాక్’

‘టిడిపి-భాజపా కూటమిదే మళ్ళీ విజయం’

‘జగన్ మహా కూటమి ఏర్పాటు చేస్తేనే చంద్రబాబుకు చెక్’

‘జగన్ కు ఒంటిరిగానే 100 సీట్లు‘

ఎంటివన్నీ అనుకుంటున్నారా? వచ్చే ఎన్నికల ఫలితాలకు సంబంధించి మీడియాలోను, సోషల్ నెట్ వర్క్ లో కొంతకాలంగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న సర్వే రిపోర్టులు. ఎంత వరకు నిజమో తెలీదు కానీ వచ్చే ఎన్నికల్లో సాధించే ఫలితాలంటూ వెలుగు చూస్తున్న సర్వేలతో రాజకీయ పార్టీల్లో గందరగోళం పెరిగిపోతోంది. ఫలానా పార్టీకి షాక్ అని, ఫలానా పార్టీలో జోష్ పెరిగిపోయిందని వెలువడుతున్న వార్తలతో అంతటా అయోమయమే. ఇటువంటి సర్వేలు కొన్ని పదులు వెలుగు చూసుంటాయి. ఇంకెన్ని సర్వేలు బయటకు వస్తాయో ఏమో?

చంద్రబాబునాయుడుకు సర్వేలు చేయించుకునే అలవాటుంది. కాబట్టి ఎంఎల్ఏ, మంత్రుల పనితీరుపై తరచూ సర్వేలు చేయించుకుంటూనే ఉంటారు. ఇక, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా అభ్యర్ధుల విషయంలో సర్వేలు చేయించుకుంటోంది. దానికి తోడు ఇటీవలే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను సలహాదారుగా నియమించుకున్నారు. దాంతో ఆయన కూడా సర్వేలు చేయిస్తున్నారట. ఈ రెండు పార్టీల కాకుండా భారతీయ జనతా పార్టీతో పాటు అదనంగా జనసక్తి. ఇంక చెప్పేదేముంది రాష్ట్రంలో సర్వేల మీద సర్వేలు. అందుకే పార్టీల్లో, జనాల్లో గందరగోళం.

ఎవరికి వారు  చేయించుకుంటున్న సర్వేలు కాక మధ్యలో లగడపాటి రాజగోపాల్. ఏమాటకామాటే చెప్పుకోవాలి. లగడపాటి సర్వేలకు విశ్వసనీయత ఎక్కువ. దాంతో లగడపాటి నిజంగా సర్వేలు చేయించారో లేదో తెలీదు గానీ ఆయన చేయించిన సర్వేలంటూ కొన్ని రిపోర్టులు జనాల్లో బాగా ప్రచారంలో ఉన్నాయ్.

‘రాజగోపాల్ సర్వేతో చంద్రబాబుకు షాక్’ అని ఒక ప్రచారం. వెంటనే ‘లగడపాటి సర్వేతో జగన్ లో అయోమయం’ అని మరో ప్రచారం మొదలవుతుంది. ‘టిడిపి+భాజపా కూటమికే వచ్చే ఎన్నికల్లో విజయం’ అని ఒక మీడియా సర్వే గతంలోనే చెప్పింది.

ప్రశాంత్ కిషోర్ సర్వే చేయించారని, అందులో జగన్ కు 100 సీట్లు, టిడిపికి 40, 35 స్ధానాల్లో గట్టిపోటి అని తాజాగా మరో ప్రచారం మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు ఉండగానే ఇన్ని సర్వే రిపోర్టులు వెలుగు చేస్తున్నాయ్. ఎన్నికల వేడి మొదలైపోతే బయటకొచ్చే సర్వే రిపోర్టులతో  రాజకీయపార్టీలకు, జనాలకు పిచ్చెక్కటం ఖాయం.

 

 

click me!