శశికళకు సుప్రిం షాక్

First Published Feb 14, 2017, 6:03 AM IST
Highlights

శశికళ కోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే గనుక జరిగితే తమిళనాడు రాజకీయాల్లో ప్రతిష్టంభన మరిన్ని రోజులు కొనసాగటం ఖాయం.

ముఖ్యమంత్రి పదవిమీద కన్నేసిన శశికళకు సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిన్నమ్మకు సుప్రింకోర్టు నాలుగేళ్లు జైలుశిక్ష విధించింది. దాంతో తమిళనాడుకు ముఖ్యమంత్రి అవ్వాలన్న శశికళ ఆశలపై సుప్రిం నీళ్ళు చల్లింది. దాంతో ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు పెద్ద ఊరటే లభించింది. శశికళ రూపంలో పెద్ద అడ్డంకి తొలగిపోయినట్లే. అయితే, చిన్నమ్మ కు సుప్రింకోర్టు శిక్ష విధించినంత మాత్రానా పన్నీర్ సిఎం అయిపోయినట్లు కాదు. చిన్నమ్మ కాకపోతే ఆమె శిభిరంలో నుండే ఇంకెవరైనా పోటీకి రావచ్చు. కాబట్టి పన్నీర్ కు ‘ఆల్ ఈజ్ వెల్’ అని కాదు.

 

తమిళనాడులో అసలు రాజకీయానికి ఇపుడే తెరలేచింది. పన్నీర్ కు అవకాశం ఇస్తూ సభలో బలం నిరూపించుకోమని చెప్పవచ్చు. లేదా శశికళ వర్గానికి బలం నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వవచ్చు. ఒకవేళ పన్నీర్ కు ముందు అవకాశం ఇస్తే బలం నిరూపించుకునేది అనుమానమే. ఎందుకంటే, శశికళ వర్గం 119 మంది ఎంఎల్ఏలతో బలంగా ఉంది. అదే పన్నీర్ విషయానికి వస్తే ఇప్పటికి ఉన్నది కేవలం 8 మంది ఎంఎల్ఏల మద్దతు మాత్రమే. ఈ పరిస్ధితుల్లో పన్నీర్ కు సరిపడా మద్దతు కూడగట్టుకోవటం కష్టమే. అయితే, కోర్టు తీర్పు నేపధ్యంలో ఎంఎల్ఏల ఆలోచనల్లో గనుక మార్పు వస్తే అపుడు పన్నీర్ వైపు మళ్ళుతారేమో చూడాలి. దానికితోడు శశికళ కోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే గనుక జరిగితే తమిళనాడు రాజకీయాల్లో ప్రతిష్టంభన మరిన్ని రోజులు కొనసాగటం ఖాయం.

 

 

click me!