సుప్రీం తీర్పు: రామసుబ్బారెడ్డి భవితవ్యం తేలేది నేడే

By narsimha lodeFirst Published Feb 7, 2019, 10:42 AM IST
Highlights

ఉమ్మడి మహబూబ్‌నగర్ ‌ జిల్లాలోని షాద్‌నగర్ జంట హత్య కేసుపై గురువారం నాడు సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది.ఈ తీర్పు ఆధారంగా మాజీ మంత్రి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి రాజకీయ భవితవ్యం తేలనుంది. 


కడప: ఉమ్మడి మహబూబ్‌నగర్ ‌ జిల్లాలోని షాద్‌నగర్ జంట హత్య కేసుపై గురువారం నాడు సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది.ఈ తీర్పు ఆధారంగా మాజీ మంత్రి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి రాజకీయ భవితవ్యం తేలనుంది. ఈ కేసులో  రామసుబ్బారెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.

ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్‌ సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రస్తుత మంత్రి, అప్పటి కాంగ్రెస్ నేత ఆదినారాయణరెడ్డి వర్గీయులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ సమయంలో  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  టీడీపీ అధికారంలో ఉంది.

చంద్రబాబునాయుడు కేబినెట్‌లో రామసుబ్బారెడ్డి మంత్రిగా కొనసాగారు.ఈ కేసులో రామసుబ్బారెడ్డికి ప్రధాన నిందితుడుగా ఉన్నారు.ప్రస్తుతం ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు కూడ టీడీపీలో ఉన్నారు. 

2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుండి  ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరారు. బాబు కేబినెట్‌లో ఆయన  మంత్రిగా కొనసాగుతున్నారు.జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి,  రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా  ఫ్యాక్షన్ గొడవలు కొనసాగుతున్నాయి.


 

click me!