విశాఖ: బ్రేక్ ఫెయిలై సముద్రంలోకి దూసుకెళ్లిన లారీ..

Siva Kodati |  
Published : Feb 07, 2019, 09:37 AM IST
విశాఖ: బ్రేక్ ఫెయిలై సముద్రంలోకి దూసుకెళ్లిన లారీ..

సారాంశం

విశాఖ బీచ్‌ రోడ్డులో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఇసుక లోడ్‌తో వెళుతున్న లారీ బీచ్ రోడ్‌లోని నోవాటెల్ హోటల్ సమీపంలో బ్రేక్ ఫెయిలవ్వడంతో డివైడర్‌ను ఢీకొట్టి బీచ్‌లోని చిల్డ్రన్ పార్క్‌లోకి దూసుకెళ్లింది. ఉదయం పూట కావడంతో పార్క్‌లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

విశాఖ బీచ్‌ రోడ్డులో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఇసుక లోడ్‌తో వెళుతున్న లారీ బీచ్ రోడ్‌లోని నోవాటెల్ హోటల్ సమీపంలో బ్రేక్ ఫెయిలవ్వడంతో డివైడర్‌ను ఢీకొట్టి బీచ్‌లోని చిల్డ్రన్ పార్క్‌లోకి దూసుకెళ్లింది.

ఉదయం పూట కావడంతో పార్క్‌లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత కొద్దిరోజుల్లో బీచ్ రోడ్‌లో ఇది రెండో ప్రమాదం.. గతంలో స్కూలు బస్సు బీచ్‌లోకి దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

దీంతో బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు జీవీఎంసీ, పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశారు. కానీ వాటిని అధికారులు పట్టించుకోలేదు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే