జగన్ సభకి వెళ్తూ ప్రమాదం.. ముగ్గురు నేతలు మృతి

Published : Feb 07, 2019, 10:12 AM IST
జగన్ సభకి వెళ్తూ ప్రమాదం.. ముగ్గురు  నేతలు మృతి

సారాంశం

జగన్ సభకి వెళ్తూ.. ముగ్గురు నేతలు ప్రమాదవశాత్తు కన్నుమూసిన సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లులో చోటుచేసుకుంది. 

జగన్ సభకి వెళ్తూ.. ముగ్గురు నేతలు ప్రమాదవశాత్తు కన్నుమూసిన సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు కడపలో  సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. ఈ సభలో ఇటీవల టీడీపీని వీడిన  కోట్ల హర్షవర్దన్ రెడ్డి నేడు వైసీపీలో చేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరులు, సన్నిహితులతో కలిసి కడప సభకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ఓర్వకల్లు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఫ్రమాదంలో కోట్ల అనుచరలు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

వారంతా.. కోట్ల హర్షవర్దన్ తోపాటు నేడు వైసీపీలో చేరాలనుకున్నారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చుసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vizag Roads Deserted During Sankranthi Festival: నిర్మానుష్యంగా వైజాగ్ రోడ్లు | Asianet News Telugu
Ambati on Sankranthi Song: నేను సంక్రాంతికి గుర్తురావడానికి కారణం Pawan Kalyan | Asianet News Telugu