ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారంనాడు కీలక తీర్పును వెల్లడించింది.
also read:స్కిల్ కేసు: 17 ఏ సెక్షన్ అంటే ఏమిటీ,ఏం చెబుతుంది?
undefined
చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు నివేదిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి.జస్టిస్ బేలా త్రివేది మాత్రం చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తించదని పేర్కొన్నారు. జస్టిస్ అనిరుద్ద బోస్ మాత్రం 17 ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని తీర్పు చెప్పారు.ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ ను ద్విసభ్య దర్మాసనం కోరింది. సెక్షన్ 17 ఏ అన్వయించడంతో తమకు భిన్నాభిప్రాయాలున్నాయని జడ్జిలు అభిప్రాయపడ్డారు. తగిన నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ కు నివేదిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును 2023 సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2023 సెప్టెంబర్ 22న కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టులో 2023 సెప్టెంబర్ 23న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు.
also read:పైలెట్ పై దాడిలో మరో ట్విస్ట్: కారణాలు వివరిస్తూ వీడియో పోస్టు చేసిన ప్యాసింజర్
ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వి కూడ వాదనలు విన్పించారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 17 ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు. కానీ, ఈ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. గత ఏడాది అక్టోబర్ మాసంలో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.