స్కిల్ కేసు: 17 ఏ సెక్షన్ అంటే ఏమిటీ,ఏం చెబుతుంది?

Published : Jan 16, 2024, 01:12 PM ISTUpdated : Jan 16, 2024, 02:09 PM IST
స్కిల్ కేసు: 17 ఏ సెక్షన్ అంటే ఏమిటీ,ఏం చెబుతుంది?

సారాంశం

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టు  ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై  సుప్రీంకోర్టు  మంగళవారంనాడు కీలక తీర్పును వెల్లడించింది. 

also read:ఏపీ రాజకీయాల్లో సంచలనం: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏమిటీ?

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును  2023 సెప్టెంబర్ 9వ తేదీన  ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు  దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  2023 సెప్టెంబర్  22న కొట్టివేసింది. దీంతో  సుప్రీంకోర్టులో  2023 సెప్టెంబర్  23న  చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు.

also read:సుప్రీం ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు: బాబు పిటిషన్ సీజేఐకి బదిలీ

ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు  విచారణ నిర్వహించింది.చంద్రబాబు తరపున  సిద్దార్థ్ లూథ్రా,  హరీష్ సాల్వే,  అభిషేక్ సింఘ్వి కూడ వాదనలు విన్పించారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 17 ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని  ఆయన తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు. కానీ, ఈ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని  ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. గత ఏడాది అక్టోబర్ మాసంలో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.

తెలుగు దేశం పార్టీ అధినేత  చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 2023 సెప్టెంబర్  9వ తేదీన  ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 50 రోజుల తర్వాత ఆరోగ్య కారణాలతో  గత ఏడాది అక్టోబర్ మాసంలో  ఆంద్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు  మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత చంద్రబాబుకు  రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే . 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ  సుప్రీంకోర్టులో  2023 సెప్టెంబర్ మాసంలో చంద్రబాబు నాయుడు  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ సయమలో  సెక్షన్  17 ఏ అంశంపై  సుధీర్ఘ వాదనలు జరిగాయి. ఈ వాదనలు విన్న తర్వాత తీర్పును  రిజర్వ్ చేసింది సుప్రీం ధర్మాసనం. అయితే  ఇవాళ తీర్పును వెల్లడించింది సుప్రీం ధర్మాసనం. ఇద్దరు జడ్జిల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పిటిషన్ ను  సీజేఐకి బదిలీ చేస్తున్నట్టుగా  సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం  పేర్కొంది.

 


 


  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

President Droupadi Murmu At Vijayawada Kanakadurga Devi Temple | Asianet Telugu
ద్రౌపదమ్మకు చీర బహుమతిగా ఇచ్చిన అనితమ్మ | Asianet Telugu