ఫలించిన జగన్ సర్కార్ కృషి... రాజధాని అమరావతిపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ

By Siva KodatiFirst Published Oct 21, 2022, 6:40 PM IST
Highlights

ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు లలిత్ కీలక నిర్ణయం తీసుకోన్నారు. ఏపీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌పై నవంబర్ 1న సుప్రీంకోర్ట్ విచారణ జరపనుంది. 

అమరావతి రాజధానికి సంబంధించి నవంబర్ 1న సుప్రీంకోర్ట్‌లో విచారణ జరగనుంది. రాజధాని అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని సుప్రీం ప్రధాని న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో నవంబర్ 1న విచారణకు అనుమతించారు సీజేఐ జస్టిస్ యు.యు లలిత్. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీ హైకోర్ట్ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ గత నెల సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ కేసులో తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశారు అమరావతి రైతులు. 

కాగా.. అమరావతి రాజధానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 3న ఏపీ హైకోర్ట్ కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సీఆర్డీయే చట్టం ప్రకారమే ఏపీ ప్రభుత్వం నడుచుకోవాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తి చేయాలని.. అమరావతిలో అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని ధర్మాసనం సూచించింది. 

Latest Videos

ALso REad:అధికార వికేంద్రీకరణే మా విధానం.. న్యాయ సలహా తర్వాతే తదుపరి నిర్ణయం : హైకోర్టు తీర్పుపై బొత్స

రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమిని వినియోగించడానికి వీల్లేదని తెలిపింది. రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కొందరు న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలని తెలిపింది. మాస్టర్ ప్లాన్ ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించాలని చెప్పింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొంది. పిటిషన్ల ఖర్చు కోసం రూ. 50 వేలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించింది. 

click me!