వాన్‌పిక్ కేసులో బ్రహ్మనందరెడ్డికి చుక్కెదురు: క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

By narsimha lode  |  First Published Dec 9, 2022, 5:11 PM IST

 వాన్ పిక్  భూ కేటాయింపుల్లో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మనందరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  బ్రహ్మనందరెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 
 


న్యూఢిల్లీ: వాన్ పిక్ భూ కేటాయింపుల్లో నిందితుడిగా ఉన్న రిటైర్డ్  ఐఆర్ఎస్ అదికారి  బ్రహ్మనందరెడ్డి  సుప్రీంకోర్టులో దాఖలు చేసిన  క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారంనాడు తోసిపుచ్చింది.వైఎస్ జగన్ ఆస్తుల కేసులో  రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉద్యోగి  బ్రహ్మనంద రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వాన్ పిక్ భూ కేటాయింపుల విషయంలో ఈ కేసు నమోదైంది.అయితే ఈ  కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో  బ్రహ్మనందరెడ్డి క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ కేసు నుండి బ్రహ్మనందరెడ్డిని తప్పించలేమని  తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూలై  28న తేల్చి చెప్పింది. బ్రహ్మనందరెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది.తెలంగాణ హైకోర్టు తీర్పుపై తాము జోక్యం చేసుకోలేమని  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 

ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉపాధి కల్పన నిమిత్తం చేపట్టిన వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఆధారిత వాన్ పిక్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు అమలుకు ఏపీ ప్రభుత్వం, రస్ అల్ ఖైమా (రాక్) ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు నిమిత్తం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 12,973 ఎకరాలను కేటాయించింది. వాన్ పిక్ ఫోర్ట్స్ ప్రాజెక్టు పేరుతో సొంత వాటా అధికంగా ఉన్న వాన్ పిక్  ప్రాజెక్టు లిమిటెడ్ కు భూ కేటాయింపులు, రాయితీలు కల్పించారని సీబీఐ ఆరోపించింది.అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపులు చేయడంతోపాటు ప్రాజెక్టులో రాక్ వాటా తగ్గింపు సహా అన్నీ జరిగాయని ఆరోపించింది. 

Latest Videos

also read:జగన్ అక్రమాస్తుల కేసు : బ్రహ్మానందరెడ్డిపై విచారణ తప్పదు, కేసునుంచి తప్పించలేం : తెలంగాణ హైకోర్టు

నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపులు, కొనుగోళ్లు జరిగాయని రాక్ నుంచి ప్రాజెక్టు నిమిత్తం వచ్చిన నిధులను మళ్లించారని ఆరోపించారు. వాన్ పిక్ ప్రాజెక్టుతో ప్రయోజనాలు కల్పించినందుకు ప్రతిఫలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ రూ. 854 కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది. 
 

click me!