లోకేశ్‌కు అడ్డొస్తాడనే జూనియర్‌ను తొక్కేస్తున్నారు... ఎన్టీఆర్ డీఎన్ఏ వుండకూడదనే : కొడాలి నాని వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Dec 09, 2022, 04:34 PM IST
లోకేశ్‌కు అడ్డొస్తాడనే జూనియర్‌ను తొక్కేస్తున్నారు... ఎన్టీఆర్ డీఎన్ఏ వుండకూడదనే : కొడాలి నాని వ్యాఖ్యలు

సారాంశం

లోకేష్‌కు అడ్డొస్తాడనే జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. లోకేష్‌కు అడ్డొస్తాడనే జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారని నాని వ్యాఖ్యానించారు. ఏపీని ఆక్రమించాలని ఓ కులం పన్నాగాలు పన్నుతోందని కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

జోగి రమేశ్ మంత్రి అయితే తాను, పేర్ని నాని, వల్లభనేని వంశీ మంత్రులైనట్లేనని చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే ఎంత దమ్ము , ధైర్యం వుంటుందో జగన్‌ ఒక్కరిలోనే అంత వుంటుందని నాని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌ లాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై వుందన్నారు. 

ALso REad:నీ గురువు మళ్లీ అధికారంలోకి రాడు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు : పవన్‌పై కొడాలి నాని సెటైర్లు

ఇకపోతే... చిరకాల మిత్రులైన కొడాలి నాని, వంగవీటి రాధాలు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. గుడివాడలో గురువారం జరిగిన వైసీపీ నేత కుమార్తె వివాహనికి వీరిద్దరూ హాజరయ్యారు. అంతేకాదు.. రాధ వస్తున్న విషయం తెలుసుకున్న నాని, దాదాపు అరగంట పాటు వెయిట్ చేశారు. వధూవరుల్ని ఆశీర్వదించిన అనంతరం ఇద్దరు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. 
    

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విశాఖలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Visakhapatnam Tour| Asianet News Telugu
పసిఫిక్ మహాసముద్రంలో తుపాను...ఏపీ, తెలంగాణలో వర్షాలు | AP & Telangana Weather | Asianet News Telugu