సుప్రీంలో జగన్ సర్కార్‌కు చుక్కెదురు: నిమ్మగడ్డ కేసులో స్టేకి నిరాకరణ

By narsimha lodeFirst Published Jul 8, 2020, 1:56 PM IST
Highlights

 నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బుధవారం నాడు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఫైనల్ ఆర్డర్ ఇస్తామని తెలిపింది. ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
 

 నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బుధవారం నాడు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఫైనల్ ఆర్డర్ ఇస్తామని తెలిపింది. ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.గతంలోనే ఈ విషయమై స్టేకు నిరాకరించిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. 

also read:హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన నిమ్మగడ్డ రమేష్

ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకంపై స్టే ఇవ్వాలని ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి దాఖలు చేసిస పిటిషన్ పై సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 18వ తేదీన తీర్పు వెల్లడించింది.

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కనగరాజ్ ను నియమిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం 619 జీవో జారీ చేసింది. ఎన్నికల సంఘం కమిషనర్ నియామకంలో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. అయితే ఈ విషయమై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

కనగరాజ్ నియామకానికి సంబంధించిన 619 జీవోతో పాటు, పంచాయితీ రాజ్ ఆర్డినెన్స్ విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లను రద్దు చేస్తూ ఈ ఏడాది మే 29వ తేదీన హైకోర్టు తీర్పు చెప్పింది.

హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

ఇదిలా ఉంటే తనను ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించాలని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడ రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేయలేదని కోర్టు ధిక్కరణకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందని జూన్ 24 వ తేదీన ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఏపీ హైకోర్టు ఆదేశాలతో అధికారులు  విధులు నిర్వహించలేకపోతున్నారని మధ్యంతరంగా ఎస్ఈసీగా నియమించేలా గవర్నర్ కు సూచించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు విన్పించారు.రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.గవర్నర్ కు ఇప్పుడే సూచనలు చేయలేమని తెలిపింది. ఈ పిటిషన్ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
 

click me!