24 గంటల్లో 15 మంది మృతి: ఏపీలో 22 వేలు దాటిన కరోనా కేసులు

Published : Jul 08, 2020, 01:29 PM ISTUpdated : Jul 08, 2020, 01:53 PM IST
24 గంటల్లో 15 మంది మృతి: ఏపీలో 22 వేలు దాటిన కరోనా కేసులు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,062 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 22,259కి చేరుకొన్నాయి.కరోనాతో రాష్ట్రంలో 264 కరోనాతో మరణించారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.  

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,062 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 22,259కి చేరుకొన్నాయి.కరోనాతో రాష్ట్రంలో 264 కరోనాతో మరణించారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.గత 24 గంటల్లో కరోనాతో 15 మంది మరణించారు. 

గత 24 గంటల్లో కరోనాతో 15 మంది మరణించారు.కర్నూల్‌లో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, గుంటూరు, విశాఖపట్టణంలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. 

 

 గత 24 గంటల్లో 27643 శాంపిల్స్ పరీక్షించారు. ఇందులో 1062 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 9 మందికి, ఇతర దేశాల నుండి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా సోకినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 11,101 మంది కరోనా నుండి కోలుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 10,77,733 మంది శాంపిల్స్ పరీక్షించారు. ప్రస్తుతం 10,894 మంది కరోనాతో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో2722,అనంతపురంలో 2568, గుంటూరులో2435,తూర్పుగోదావరిలో2015 కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు