
కడప: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురయిన మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు బోరున విలపించిన విషయం తెలిసిందే. తన భార్య భువనేశ్వరి గురించి వైసిపి సభ్యులు నిండు సభలో అత్యంత నీచంగా మాట్లాడారని చెబుతూ భావోద్వేగానికి లోనయిన చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. దీంతో టిడిపి నాయకులు, కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా నిండుసభలో ఓ మహిళ గురించి అనుచితవ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబడుతున్నారు.
AP Assembly లో nara bhuvaneshwari పై అనుచిత వ్యాఖ్యలు, nara chandrababu కన్నీరు పెట్టుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ఓ మహిళా తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు మద్దతుగా తన గవర్నమెంట్ జాబ్ ను వదిలేస్తున్నట్లు కడప జిల్లాకు చెందిన అనిత దీప్తి దుద్యాల ప్రకటించారు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకూ తన వంతుగా ఆయన కోసమే నిత్యం పనిచేస్తానని అన్నారు. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాని deepthi dudyala తెలియజేశారు.
వీడియో
ప్రస్తుత ఏపీ cm ys jaganmohan reddy సొంతజిల్లా kdapa లోని రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంట కోట గ్రామానికి చేసిన అనిత దీప్తి దుద్యాల ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో మెప్మాలో కోఆర్ఢినేటర్ గా పనిచేస్తున్నారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని ఏడేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన ఈమె ప్రస్తుతం మెప్మాలో కోఆర్ఢినేటర్ గా కొనసాగుతోంది.
read more చంద్రబాబుకి సోనూసూద్ పరామర్శ.. హైదరాబాద్‌కి వచ్చి కలుస్తానంటూ ఫోన్‌లో ఓదార్పు
ఇలా దాదాపు రూ.40వేల జీతంతో ఆమె జీవితం ఆనందంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆమె ఎంతగానో అభిమానించే చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకోవడం చూసి తీవ్ర మనోవేధనకు గురయిన దీప్తి రాజీనామా నిర్ణయం తీసుకుంది.
నిండు సభలో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై వైసిపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బాధపడ్డానని దీప్తి తెలిపింది. అసెంబ్లీలో తన భార్య గురించి వైసిపి నాయకులు మాట్లాడిన మాటలను వివరిస్తూ చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకోవడం చూసిన ఎంతగానో బాధపడ్డానని అన్నారు. దీంతో మనసు చలించి ఆయనకు మద్దతుగా ఈ వైసిపి ప్రభుత్వంలో ఉద్యోగం అవసరం చేయకూడనదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో రైల్వేకోడూరులోని ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా తన ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగిందని దీప్తి తెలిపారు.
ఇదిలావుంటే చంద్రబాబు కంటతడి పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయిన ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాను ఎంతో అభిమానించే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్‌గా ప్రకాశం జిల్లా నుంచి టాపర్ గా నిలిచానని ఆయన గుర్తుచేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎంతో నిజాయతీతో పని చేశానని ఆయన చెప్పారు. ఎప్పుడూ ఎవరి వద్దా చేయి చాచకుండా విధులను నిర్వర్తించానని తెలిపారు. ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితులు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక వ్యక్తిని అసెంబ్లీలో దూషించడం సరికాదని... విలువలు లేని వారి వద్ద పని చేయడం ఇష్టం లేక తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని హెడ్ కానిస్టేబుల్ వెల్లడించారు.