అంగళ్లు కేసులో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు: హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

By narsimha lode  |  First Published Oct 3, 2023, 11:46 AM IST

అంగళ్లు కేసులో ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ సవాల్ చేసింది.


అమరావతి:పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు కేసులో  ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. టీడీపీ నేతలకు  ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టులో  ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.  ఈ పిటిషన్ పై మంగళవారంనాడు సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్య చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది.అంగళ్లు కేసులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.అంగళ్లు కేసులో  టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సమర్ధించింది. 

అంగళ్లు కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమా,  టీడీపీ నేతలు పులివర్తి నాని, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు  ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం  సవాల్ చేసింది.

Latest Videos

undefined

అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది.అంగళ్లు కేసులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.అంగళ్లు కేసులో  టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సమర్ధించింది. 

పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అంగళ్లులో ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  ఇచ్చిన రూట్ లో కాకుండా చంద్రబాబు మరో రూట్ లో రావడంతోనే ఘర్షణలు చోటు చేసుకొన్నాయని పోలీసులు ఆరోపించారు.

also read:పుంగనూరు అంగళ్లు కేసు: 79 మంది టీడీపీ నేతలకు బెయిల్

చంద్రబాబు వెళ్లే రూట్ లో వైసీపీ కార్యకర్తలు బస్సును అడ్డుగా పెట్టి  అడ్డుకోవడం వల్లే  ఈ ఘర్షణ చోటు చేసుకుందని టీడీపీ  ఆరోపించింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘర్షణలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి.ఈ ఘర్షణకు సంబంధించి  రెండు వందలకు పైగా  టీడీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు సహా  పలువురిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఏ1గా చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసుపై చంద్రబాబు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో దేవినేని ఉమా, నల్లారి కిషోర్ రెడ్డి, పులివర్తి నానిలకు  ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టైన  టీడీపీ నేతలు, కార్యకర్తలు 79 మంది ఈ ఏడాది సెప్టెంబర్ 21న బెయిల్ మంజూరు చేసింది.
 

click me!