అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై సీఐడీ నోటీసులు: ఏపీ హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్

By narsimha lodeFirst Published Oct 3, 2023, 11:01 AM IST
Highlights

ఏపీ హైకోర్టులో  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  మంగళవారంనాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  ఏపీ సీఐడీ అధికారులు  ఇచ్చిన  41 ఏ నోటీసులో  పేర్కొన్న అంశాలపై  లోకేష్ ఏపీ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  గత నెల 30వ తేదీన న్యూఢిల్లీలో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.ఈ నెల 4న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు.హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన తీర్మానాలు, అకౌంట్ పుస్తకాలు తీసుకురావాలని ఆ నోటీసులో కోరారు. వీటితో పాటు ఇతర అంశాలపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Latest Videos

మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం  నారా లోకేష్ ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  గత నెల 29వ తేదీన లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై  విచారణను  ఏపీ హైకోర్టు ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఇవాళ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 4వ తేదీ వరకు  లోకేష్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను  ఏపీ హైకోర్టు స్వీకరించింది.ఇవాళ మధ్యాహ్నం 02:15 గంటలకు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించనుంది.

హెరిటేజ్ ఫుడ్స్ నుండి తాను  ఎప్పుడో బయటకు వచ్చినట్టుగా  లోకేష్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. హెరిటేజ్ సంస్థకు చెందిన  తీర్మానాలు,  అకౌంట్ బుక్స్ ను ఎలా తీసుకు వస్తానని  లోకేష్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో  తనకు ఎలాంటి సంబంధం లేదని  లోకేష్ పేర్కొన్నారు. అయినా కూడ ఈ కేసులో తన పేరును చేర్చడంపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.సంబంధం లేని అంశంపై కేసు నమోదు చేసి  అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.2017లో లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని  పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్  ప్రాజెక్టును  2014లో ప్రారంభించినట్టుగా  ఆ పిటిషనర్ గుర్తు చేశారు.పంచాయితీరాజ్, ఐటీ శాఖలను లోకేష్ నిర్వహించినట్టుగా  పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ కు  ఈ రెండు శాఖలతో ఎలాంటి సంబంధం లేదని  ఆ పిటిషన్ లో లోకేష్  ప్రస్తావించారు.

also read:ఏపీ పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరాం: సత్యవజయతే దీక్ష తర్వాత లోకేష్

ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈ నెల 4వ తేదీన లోకేష్ కు, మాజీ మంత్రి నారాయణకు కూడ సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరిని ఈ నెల 4వ తేదీన సీఐడీ విచారించనుంది.  చంద్రబాబు అరెస్ట్ తర్వాత న్యూఢిల్లీ వెళ్లిన లోకేష్  సీఐడీ విచారణ కోసం రేపు అమరావతికి రానున్నారు.


 

 

click me!