
అధికారం కాపాడుకునేందుకు నాయకులు ఎంతకైనా తెగిస్తారని, కృూరంగా ఆలోచిస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అధికారం కోల్పోతున్నామనే భావన ఏదైనా చేయిస్తుందని తెలిపారు. తనను చంపేందుకు కూడా సుపారీ గ్యాంగులను రంగంలోకి దించారని తనకు సమాచారం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నాయకులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.
గుజరాత్ దర్గా వివాదం.. జునాగఢ్ లో ఆక్రమణల తొలగింపు వద్దంటూ పోలీసులపైకి రాళ్లు.. పౌరుడు మృతి
ప్రస్తుతం జనసేన బలంగా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలో నుంచి దించే దిశలో ప్రయాణం చేస్తోందని తెలిపారు. ఇలాంటి సమయంలోనే నాయకులు ఏమైనా చేసేందుకు సిద్ధపడుతారని అన్నారు. అధికారం పోతుందనే భావన వారితో ఏమైనా చేయిస్తుందని తెలిపారు. క్రూరంగా మార్చే అవకాశం ఉందని చెప్పారు.
ఒడిశా సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ లో దారుణం.. ఫారెస్ట్ ఆఫీసర్ ను కాల్చి చంపిన వేటగాళ్లు..
తనను బయపెడితే మరింతగా రాటుదేలుతానని జనసేన అధినేత అన్నారు. గతంలో కాకినాడ శాసనసభ్యుడి అనుచరులు తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, మహిళలపై దాడి చేశారనే విషయం తనకు గుర్తు ఉందని తెలిపారు. దానిని మర్చిపోలేదని అన్నారు. అప్పట్లో తమ పార్టీకి బలమైన కార్యాచరణ లేదని, అందుకే వెనకడుగు వేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే కరెట్టు సమాధానం చెప్పే రోజు తప్పకుండా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లోని 34 స్థానాల్లో, అధికార వైసీపీకి ఒక్క సీటూ గెలవనివ్వకూడదని జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ సూచించారు.