డిజిటల్ కరెన్సీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు .. ఇంతకీ ఏమన్నారంటే..?

Published : Jun 18, 2023, 01:28 AM IST
డిజిటల్ కరెన్సీపై  చంద్రబాబు కీలక వ్యాఖ్యలు .. ఇంతకీ ఏమన్నారంటే..?

సారాంశం

సాంకేతికత ద్వారా సమాజంలో మార్పులు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కోన్నారు.  ఈ మేరకు హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఫోరమ్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ) సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. టెక్నాలజీ, పాలసీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాంకేతికత (టెక్నాలజీ), విధానాలు (పాలసీ)లు అన్ని రంగాల్లో సమర్థంగా అమలు చేయాలని, అలా చేయడం ద్వారా పేదరికం లేని సమాజం సాధ్యమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు  అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన GFST (Global Forum for Sustainable Transformation) సదస్సులో చంద్రబాబు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ‘డీప్‌ టెక్నాలజీస్‌’ అనే అంశంపై చర్చించారు.  

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. టెక్నాలజీను సమర్థవంతంగా వినియోగించుకుంటే.. సమాజంలో సమూల మార్పులు తీసుకురావొచ్చని, అదే తన జీవిత లక్ష్యమన్నారు. తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయిన సమయంలో భవిష్యత్ లో ఐటీలో ఉన్న అవకాశాలను గుర్తించానని తెలిపారు. భారత దేశానికి ఉన్న అనేక బలాల కారణంగా 2047 నాటికి ప్రపంచ నంబర్‌-1 ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టడంతో పాటు... ప్రపంచ వ్యాప్తంగా తిరిగి వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడాననీ తెలిపారు. అలాగే.. భారతీయుల సమర్థతల గురించి విస్తృతంగా ప్రచారం చేశాననీ, మన దేశంలో కంపెనీలు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలకు గురించి క్లుప్తంగా వివరించనని తెలిపారు. అదే సమయంలో ట్రిపుల్ ఐటీతో సహా పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించామనీ,  తద్వారా పెద్ద ఎత్తున ఐటీ రంగ నిపుణులు అందుబాటులోకి వచ్చారని తెలిపారు.

అయితే.. ఆ రోజుల్లో ఒక ఫోన్ కాల్ మాట్లాడాలంటే గంటలు, కొన్నిసార్లు రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చేదనీ అన్నారు. ఇలాంటి ఆటంకాలను తొలగించడం కోసం  ప్రధాని వాజ్ పేయితో మాట్లాడి డీ రెగ్యులేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ విధానాన్ని తీసుకువచ్చానని తెలిపారు. తద్వారా ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ తరుణంలో బిల్ గేట్స్ తో మాట్లాడి మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను తీసుకువచ్చాననీ,  నాడు ఐటీ విప్లవాన్ని తెలుగు జాతి సమర్థవంతంగా ఉపయోగించుకుందని తెలిపారు.


డిజిటల్ కరెన్సీ రావాలి

 డిజిటల్ కరెన్సీ రావాలి అనేది తన బలమైన కోరిక అని చంద్రబాబు అన్నారు. అలాగే.. పెద్ద నోట్లను రద్దు చేయాలనీ, తద్వారా మనీ లాండరింగ్, బ్లాక్ మనీ సహా అన్నిటికీ చెక్ పడుతాయని అన్నారు.  అప్పుడు ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతుందనీ, తద్వారా పేద ప్రజలపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టవచ్చని అన్నారు. సమర్థవంతమైన నాయకత్వంతోనే కుటుంబంలో అయినా, రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా మార్పు వస్తుందని తెలిపారు. రాజకీయాల్లోకి మంచి వ్యక్తులు రావాలనీ,అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలనీ,  ఓటింగ్ పెరగడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!
CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu