టీడీపీ - బీజేపీ పొత్తుపై ఊహాగానాలు .. నారా లోకేష్‌పై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు

Siva Kodati |  
Published : Jun 17, 2023, 06:56 PM IST
టీడీపీ - బీజేపీ పొత్తుపై ఊహాగానాలు  .. నారా లోకేష్‌పై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు

సారాంశం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై విమర్శలు గుప్పించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాయలసీమను అభివృద్ధి చేస్తామని లోకేష్ ఎలా హామీలు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.   

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తులు వుంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమను అభివృద్ధి చేస్తామని లోకేష్ ఎలా హామీలు ఇస్తున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు సీఎంగా వున్నప్పటికీ చంద్రబాబు సీమకు ఏం చేయలేదన్నారు. ఇప్పుడు రాయలసీమను అభివృద్ధి చేస్తామంటే జంన నమ్మరని సోము వీర్రాజు చురకలంటించారు.

రాష్ట్రంలో రోడ్డు వేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వమని.. ఏపీలో వున్న వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక్క కిలోమీటర్ రోడ్లు కూడా వేయలేదన్నారు. తమ పథకాలకు జగన్ తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని సోము వీర్రాజు విమర్శంచారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని.. ఏకంగా ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. 

ALso Read: అమిత్ షాపై వ్యాఖ్యలు .. జేబులు ఎవరు నింపుకుంటున్నారో తెలుసు : బొత్సకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్

కాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై వైసీపీ నేత, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. గురువారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వైసీపీ అవినీతిని ప్రజలే నిరూపిస్తారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువగానే నిధులు ఇచ్చామని లక్ష్మణ్ తెలిపారు. ప్రత్యేక హోదాకు మించిన నిధులు ఏపీకి ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి ఎవరితోనూ పొత్తులు వుండవని సొంతంగానే పోటీ చేస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరు జేబులు నింపుకుంటున్నారో ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. 

మోడీ కంటే ఎక్కువ అభివృద్ధి, సంక్షేమం చేసినట్లు నిరూపిస్తారా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రగతి నివేదికను నిజాయితీగా ప్రజల ముందు వుంచుతున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్ధికంగా అతలాకుతలం అవుతుంటే మోడీ ముందుచూపు వల్లే భారత్ గట్టెక్కిందని లక్ష్మణ్ వెల్లడించారు. భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2గా వుందని.. ప్రపంచం ఆర్ధిక ఇబ్బందులు పడుతోందని, కొన్ని దేశాల్లో ఆహార కొరత వుందని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని లక్ష్మణ్ ఆకాంక్షించారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hero Ghattamaneni Jayakrishna Speech: జై బాబు.. బాబాయ్ కి నేను పెద్ద ఫ్యాన్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం | Asianet Telugu