వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

Published : Mar 21, 2019, 02:42 PM ISTUpdated : Mar 21, 2019, 02:54 PM IST
వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పుదోవ పట్టించే విధంగా  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారని వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డి ఏపీ  ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు.

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పుదోవ పట్టించే విధంగా  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారని వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డి ఏపీ  ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు.

గురువారం నాడు ఆమె ఏపీ  ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని  కలిశారు. వివేకానందరెడ్డి  హత్య కేసును తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు. 

ఈ హత్య కేసు విచారణను నిష్పక్షపాతంగా విచారించాలని  ఆమె కోరారు. కేసు విచారణణు తప్పుదారి పట్టించేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కేసులో అసలైన నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

సంబంధిత వార్తలు

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు

 

PREV
click me!

Recommended Stories

Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu
Lokesh Interaction with Students: లోకేష్ స్పీచ్ కిదద్దరిల్లిన సభ | Asianet News Telugu