లోకేష్ ఎన్నికల హోలీ ట్వీట్... నెటిజన్ల ట్రోల్స్

Published : Mar 21, 2019, 02:36 PM IST
లోకేష్ ఎన్నికల హోలీ ట్వీట్... నెటిజన్ల ట్రోల్స్

సారాంశం

ఏపీ మంత్రి లోకేష్ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడ్డారు. ఆయన రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపేందుకు చేసిన ట్వీట్ ని పట్టుకొని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

ఏపీ మంత్రి లోకేష్ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడ్డారు. ఆయన రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపేందుకు చేసిన ట్వీట్ ని పట్టుకొని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ లోకేష్ ని అలా ట్రోల్ చేయడానికి కారణం ఏమిటంటే.. హోలీ శుభాకాంక్షలు తెలుపుతూనే.. అందులో.. ఎన్నికలను ముడిపెట్టారు.

హోళీ రోజు రసాయన రంగులు హాని చేస్తాయని, సహజరంగులు ఆనందాన్ని ఇస్తాయని ట్విటర్‌లో సూచించారు. హోలీ పండుగను సహజ రంగులతో సురక్షితంగా జరుపుకోవాలని కోరారు. పసుపు సహజమైన రంగు. మీ భవిష్యత్తుకు శుభాన్నిస్తుంది అని పేర్కొన్నారు. మోసపూరిత వాగ్దానాలు కూడా సింథటిక్ రంగుల్లాంటివే అంటూ ట్వీట్‌ చేశారు. 

అయితే హోలీ శుభాకాంక్షల వరకు బాగానే ఉన్నా, పండగను కూడా పసుపురంగుతో ముడిపెట్టి రాజకీయ రంగుపులమడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu