జగన్ ను అరెస్టు చేస్తే సంబరాలు: అచ్చెన్న అరెస్టుపై హోం మంత్రి సుచరిత

By telugu teamFirst Published Jun 12, 2020, 12:46 PM IST
Highlights

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినట్లు సుచరిత తెలిపారు.

గుంటూరు: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆమె అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అరెస్టు చేసినప్పుడు సంబరాలు చేసుకున్నవారు ఇప్పుడెలా మాట్లాడుతారని ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అచ్చెన్నాయుడిని లాక్కుని వెళ్లలేదని, మామూలుగానే తీసుకుని వెళ్లారని ఆమె స్పష్టం చేశారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆమె అన్నారు. 

Also Read: ఏపి, తెలంగాణాల్లో ఈఎస్ఐ స్కాం...రెండుచోట్ల బాధ్యులు వారే: అయ్యన్నపాత్రుడు

వైద్య పరికరాల కొనుగోళ్లలో కూడా అవినీతి జరిగిందని చెప్పారు. అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవద్దా అని సుచరిత ప్రశ్నించారు. అది కేంద్ర ప్రభుత్వం డబ్బైనా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బైనా చర్యలు తీసుకోవాల్సిందే కదా అని సుచరిత అన్నారు. 

వీడియో

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెనాయుడిని పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిససిందే.  శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఆయనను అరెస్టు చేశారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 

Video: అచ్చెన్నాయుడుతో పాటు ఇంకా ముగ్గురి అరెస్ట్.. ఏసీబీ జేడీ రవికుమార్.

అచ్చెన్నాయుడు సిఫార్సుల కారణంగానే అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టీడీఎల్పీ) ఉప నేతగా ఆయన ఉన్నారు. శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడి అరెస్టు జరిగింది. 

click me!