
శ్రీశైలం: మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారంనాడు స్టీమ్ వాటర్ బాయిలర్ పేలింది.దీంతో అ క్కడ పనిచేస్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు.నిత్య అన్నదానం బయటవైపు ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాయిలర్ పేలుడుకుగల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.స్టీమింగ్ బాయిలర్ బాగా వేడేక్కడంతో పేలిపోయినట్టుగా అక్కడ పనిచేసే సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ బాయిలర్ పేలుుడు కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.