శత్రుచర్ల చుట్టూర శత్రువులే...

Published : Mar 01, 2017, 02:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
శత్రుచర్ల చుట్టూర శత్రువులే...

సారాంశం

శ్రీకాకుళంలో చంద్రబాబు  నాయుడు కష్టాలు, ఒకవైపు టోకరా ఇస్తున్న తమ్ముళ్లు, మరొక వైపు నుంచి వైసిపి చెక్

శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి తెలుగుదేశానికి ఏకగ్రీవంగా దక్కకుండా వైసిపి నాయకుడు బోత్స సత్యనారాయణ చెక్ పెట్టారు.

 

బోత్స వేయించిన అభ్యర్థి గెలుస్తాడో లేడో తెలియదు గాని, తన అభ్యర్థిని ఉన్నట్టుండి రంగంలోకి  తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవ సంబరాలు చేసుకోకుండా బోత్స అడ్డుకోగలిగారు.

 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ఫిబ్రవరి 28 గడవు నిన్న ముగిసింది. తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కు పోటీగా ఎవరూ నామినేషన్ వేయరనుకున్నారు. ఏకగ్రీవమే అనుకున్నారు. శత్రుచర్ల విజయరామరాజు(పక్క ఫోటో) కలెక్టరేట్‌లో టిడిపి తరఫున నామినేషన్ దాఖలు చేశారు.

 

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషా ఉత్సాహంగా ఇక ఏకగ్రీవమే అనుకుంటున్నపుడు , మధ్యాహ్నం నాలుగు గంటలతో సమయం పూర్తయ్యేలోపు మరో ఇద్దరు అభ్యర్థులు- మామిడి శ్రీకాంత్, కంచిలి పిఎసిఎస్ అధ్యక్షుడు తమరాల శోభనబాబు- ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీనితో ఏకగ్రీవంగా  శత్రుచర్ల ను గెలిపించి క్రెడిట్ కొట్టాలనుకున్న ఇన్‌ఛార్జి మంత్రి సునీత,జిల్లా మంత్రి అచ్చన్నాయుడు ఉత్సాహం నీరు కారింది.

 

జిల్లా ఎమ్మెల్యేలెంతగానో  కృషి చేసినప్పటికీ పక్క జిల్లా ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి బొత్స పట్టుబట్టి మామిడి శ్రీకాంత్‌తో నామినేషన్ దాఖలు చేయించారని  సమాచారం. ఇది కాపు రాజకీయంలో భాగమంటున్నారు. శ్రీకాంత్  తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన వాడు. బొత్స బంధువు. టిడిపి కాపులకు అన్యాయం చేస్తూ ఉందన అనే  భావం కాపులలో బాగా ఉంది. దీనిని సొమ్ముచేసుకునేందుకు బోత్స  కాపును రంగంలోకి దించారు.  

 

బోత్స అంతకు ముందు ఏకంగా టిడిపి నుంచి కాపు కులానికి చెందిన కోళ్ళ అప్పలనాయుడుతో నామినేషన్ దాఖలు చేసేలా ఏర్పాట్టు చేశాడు. వైసిపి వాడేమిటి, టిడిపి అభ్యర్థిని నిలబెట్టడమేమిటని అగ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగాడు. ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీతను శ్రీకాకుళం పంపాడు. ప్రభుత్వ విప్ కూనరవికుమార్, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శీరిషాలతో మంతానాలు జరిపించాడు. 


డిసిసి చైర్మన్‌గా కాపు కులానికి చెందిన  కోళ్ళ అప్పలనాయుడుకి కాకుండా మరెవరికిస్తామని ఎన్నికల హామీ ఒకటి ఇప్పించి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీనితో ఒక ఎన్నిక  ఏకగ్రీవమే టిడిపి నేతలు చంకలెగురేసుకుంటున్నపుడు బోత్స అటువైపు నుంచి నరుక్కొచ్చాడు.

 


మరి రెండో ఇండిపెండెంటు అభ్యర్థిన శోభన్ బాబు ఎవరి ప్రోత్సాహంతో నామినేషన్ వేశాడు. ఇదొక చర్చనీయాంశమయింది జిల్లాలో. ఎందుకంటే  టిటిపి కంచుకోట  అనిపేరున్న  ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి పిఎసిఎస్ అధ్యక్షుడు శోభనబాబు తెలుగుదేశం నాయకుడే. ఆయనే అందరికంటే ముందుగా తన నామినేషన్ దాఖలు చేశారు. టిడిపికి విధేయుడినని చెప్పుకుంటూ, పార్టీ అధికారిక అభ్యర్థిపై  నామినేషన్ దాఖలు చేయడం ఏమిటి? 


దీని వెనక  తెలుగుదేశం మంత్రి అచ్చన్న బాబాయ్, ఎంపి రామ్మోహన్ అబ్చాయ్ ల  రాజకీయం ఉందని  శ్రీకాకుళం ఏ టి బంకు దగ్గిర నిలబడుకున్న వినబడే చర్చ.
శత్రుచర్ల ఏకగ్రీవం కాకుండా అడ్డుకోవడానికి ఇదోరకమైన ఎత్తుగడ అని చెబుతున్నారు. అంతేకాదు,  దీనికి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సహకారం, కూడా ఉందంటున్నారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?