శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 08, 2024, 03:24 PM ISTUpdated : Mar 08, 2024, 03:27 PM IST
శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

మూడు పంటలు పండే సారవంతమైన భూములు వున్నా.. కరువు ప్రాంతంగానే మిగిలిపోయింది శ్రీకాకుళం. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం దేశంలోని పలు నగరాలకు వలస వెళ్తుండటం నిత్యం కనిపించే దృశ్యం. ఎన్జీ రంగా, గౌతు లచ్చన్న, బొడ్డేపల్లి రాజగోపాల్ రావు, ఎన్టీఆర్ వంటి మహనీయులు ఈ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహించారు. సర్వేలకు సైతం అంతుపట్టిన తీర్పును ఇక్కడి ఓటర్లు ఇస్తూ వుంటారు. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా.. తమ బతుకులు మాత్రం మారడం లేదని ప్రజలు రోడ్డెక్కుతూ వుంటారు. హక్కుల కోసం పోరాడమూ.. ఆదరించి అక్కున చేర్చుకోవడంలో సిక్కోలు ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలిచారు. 1952లో ఏర్పడిన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్‌కు కంచుకోట. హస్తం పార్టీ 9 సార్లు, టీడీపీ 7 సార్లు, ఇతరులు 2 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు.

శ్రీకాకుళం అంటే ఉద్యమాల పురిటిగడ్డ.. ఏపీ రాజకీయాల్లోనే ఈ ప్రాంతం సంథింగ్ స్పెషల్. సర్వేలకు సైతం అంతుపట్టిన తీర్పును ఇక్కడి ఓటర్లు ఇస్తూ వుంటారు. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా.. తమ బతుకులు మాత్రం మారడం లేదని ప్రజలు రోడ్డెక్కుతూ వుంటారు. హక్కుల కోసం పోరాడమూ.. ఆదరించి అక్కున చేర్చుకోవడంలో సిక్కోలు ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఎందరో రాజకీయ ఉద్ధండులను భారతదేశానికి అందించిన ఘనత శ్రీకాకుళానిదే.

ఉమ్మడి జిల్లాలో రాజకీయాలను ఒక్కోసారి ఒక్కో పార్టీ శాసిస్తూ వుంటుంది. మూడు పంటలు పండే సారవంతమైన భూములు వున్నా.. కరువు ప్రాంతంగానే మిగిలిపోయింది శ్రీకాకుళం. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం దేశంలోని పలు నగరాలకు వలస వెళ్తుండటం నిత్యం కనిపించే దృశ్యం. ఎన్జీ రంగా, గౌతు లచ్చన్న, బొడ్డేపల్లి రాజగోపాల్ రావు, ఎన్టీఆర్ వంటి మహనీయులు ఈ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహించారు. 

శ్రీకాకుళం ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 ..టీడీపీ కంచుకోట :

1952లో ఏర్పడిన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్‌కు కంచుకోట. హస్తం పార్టీ 9 సార్లు, టీడీపీ 7 సార్లు, ఇతరులు 2 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 15,53,860 మంది. వీరిలో పురుషులు 5,48,060 మంది.. మహిళా ఓటర్లు 5,94,937 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 11,57,329 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. 74.48 శాతం పోలింగ్ నమోదైంది. 

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో ఐదింటిని వైసీపీ కైవసం చేసుకోగా.. టీడీపీ రెండు చోట్ల గెలిచింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి కింజారపు రామ్మోహన్ నాయుడుకు 5,34,544 ఓట్లు.. వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్‌కు 5,27,891 ఓట్లు.. జనసేన అభ్యర్ధి మెట్టా రామారావుకు 31,956 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా టీడీపీ 6,653 ఓట్ల తేడాతో శ్రీకాకుళం ఎంపీ సీటును కైవసం చేసుకుంది.

శ్రీకాకుళం ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై రామ్మోహన్ నాయుడు కన్ను :

ఉత్తరాంధ్రలో మరోసారి ప్రభంజనం సృష్టించాలని భావిస్తున్న అధికార వైసీపీకి శ్రీకాకుళం ఎంపీ సీటు కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఎర్రన్నాయుడు కుటుంబం ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆయన నాలుగు సార్లు, ఎర్రన్న తనయుడు రామ్మోహన్ నాయుడు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. జగన్ గాలి బాగా వీచినప్పటికీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఈ సెగ్మెంట్‌పై పట్టు నిలుపుకుంది. 1996 నుంచి 2019 వరకు ఒకే ఒక్కసారి కాంగ్రెస్ గెలవగా.. మిగిలిన అన్ని సార్లు సైకిల్ దూసుకెళ్లిందంటే ఇక్కడ టీడీపీ ప్రభావం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. 

తెలుగుదేశాన్ని ఓడించే బలమైన అభ్యర్ధి కోసం జగన్ కసరత్తు చేస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన బ్రదర్స్‌ను కోరగా.. వారు మరోసారి అసెంబ్లీకి పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్న డాక్టర్ దానేటి శ్రీధర్‌ను బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తోంది. ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడంతో పాటు కాళింగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అన్ని విధాలా కలిసి వస్తుందని భావిస్తున్నారు.

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరును కూడా జగన్ పరిశీలిస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. మరోమాట లేకుండా రామ్మోహన్ నాయుడికి టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. ఎర్రన్నపై జిల్లా ప్రజల్లో వున్న అభిమానానికి తోడు.. తన వాగ్ధాటితో రామ్మోహన్ నాయుడు ఆకట్టుకుంటున్నారు. ఈసారి కూడా తనదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu