వై.ఎస్. సునీతారెడ్డి ఆత్మీయ సమ్మేళనం: రాజకీయాల్లోకి వస్తారా?

By narsimha lode  |  First Published Mar 8, 2024, 7:13 AM IST


వై.ఎస్. వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి రాజకీయాల్లో వస్తారా అనే విషయమై సర్వత్రా చర్చ సాగుతుంది. 


కడప: దివంగత మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి కూతురు  సునీతారెడ్డి  తమ అనుచరులు, సన్నిహితులతో  సమావేశం కానున్నారు.ఈ నెల  15న కడపలో  ఈ సమావేశం నిర్వహించనున్నారు.  సునీతా రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ఇటీవల కాలంలో  ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.  

ఇటీవలనే  తన తండ్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య  విషయమై  సునీతారెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిల  బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇడుపులపాయలో  ఆమెతో సునీతా రెడ్డి భేటీ అయ్యారు.  ఈ  భేటీపై  రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగింది.అయితే  ఈ నెల 15న  సునీతా రెడ్డి ఆత్మీయ సమ్మేళంపై రాజకీయవర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

Latest Videos

undefined

ఇటీవలనే న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై  సునీతా రెడ్డి  విమర్శలు చేసిన విషయం తెలిసిందే.కడప పార్లమెంట్ స్థానం లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి  వై.ఎస్. వివేకానందరెడ్డి భార్యను ఎన్నికల బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ పై  సునీతా రెడ్డి  విమర్శలపై వైఎస్ఆర్‌సీపీ  అంతే స్థాయిలో స్పందించింది.  రాజకీయ దురుద్దేశంతోనే  సునీతారెడ్డి విమర్శలున్నాయని  ఆ పార్టీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

2019 మార్చి మాసంలో  వై.ఎస్. వివేకానంద రెడ్డి  హత్యకు గురయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య  కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుంది. 

ఈ నెల  15న కడపలో  వై.ఎస్. సునీతారెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.ఈ సమావేశంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై  సునీతా రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
 

click me!