సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి బీవీ రాఘవులు రాజీనామా?

By narsimha lodeFirst Published Mar 24, 2023, 11:15 AM IST
Highlights


సీపీఎం  పొలిట్ బ్యూరో పదవికి  బీవీ రాఘవులు  రాజీనామా  చేశారు.   ఈ రాజీనామాను  పార్టీ పొలిట్ బ్యూరో  ఇంకా ఆమోదించలేదని   ప్రచారం సాగుతుంది.

హైదరాబాద్:సీపీఎం  పొలిట్ బ్యూరో  పదవికి   బీవీ రాఘవులు రాజీనామా  చేశారు.  అయితే  ఈ రాజీనామాను  పొలిట్ బ్యూరో ఆమోదించలేదు.  రాజీనామాను వెనక్కు తీసుకోవాలని  బీవీ రాఘవులును  పార్టీ నాయకత్వం  బుజ్జగిస్తుందని  సమాచారం.. పార్టీ నిర్మాణం, క్యాడర్  నియామకం  విషయంలో  బీవీ రాఘవులు  పార్టీతో  విబేధిస్తున్నారని  ప్రచారం సాగుతుంది.  బీవీ రాఘవులు  పొలిట్ బ్యూరో  పదవికి రాజీనామా చేసిన విషయమై   ఆ పార్టీ  స్పందించలేదని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం  చేసింది.  

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు  పని చేశారు.  తెలంగాణ  ఉద్యమం ఉధృతంగా  సాగుతున్న తరుణంలో  రాఘవులు సీపీఎం కార్యదర్శిగా  ఉన్నారు. ఎస్‌ఎఫ్ఐ  ద్వారా  రాఘవులు  రాజకీయాల్లోకి వచ్చారు.  సీపీఎం  సంస్థాగత  నిర్మాణంలో  రాఘవులు  కీలకంగా  వ్యవహరించారు.   రాష్ట్ర విభజన తర్వాత   ఏపీ రాష్ట్రంలో  పార్టీ పై  రాఘవులు  పనిచేస్తున్నారు. అప్పుడప్పుడూ తెలంగాణ   రాష్ట్రంలో  కూడా రాఘవులు  పార్టీ వ్యవహరాల్లో   పాల్గొంటున్నారు. 

ఇదిలా ఉంటే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఎం  కార్యదర్శిగా  వి. శ్రీనివాసరావు కొనసాగుతున్నారు.  వి.శ్రీనివాసరావు  రాష్ట్ర కార్యదర్శిగా  బాధ్యతలు  చేపట్టిన తర్వాత తీసుకుంటున్న  నిర్ణయాలపై  మాజీ ఎమ్మెల్యే  ,సీపీఎం  సీనియర్ నేత ఎంఏ గఫూర్  పార్టీ కార్యక్రమాలకు  దూరంగా  ఉంటున్నారు. గఫూర్ పార్టీ మారుతారనే  ప్రచారం కూడా సాగింది. ఈ ప్రచారాన్ని గఫూర్ ఖండించారు.  తన అభిప్రాయాలను  పార్టీ వేదికలపైనే  చర్చించనున్నట్టుగా  గఫూర్ గతంలోనే  మీడియాకు  తెలిపిన విషయం తెలిసిందే. 
 

click me!