ఇంకా వైస్రాయి రాజకీయాలు: చంద్రబాబుపై రోజా ఫైర్

By narsimha lodeFirst Published Mar 24, 2023, 10:30 AM IST
Highlights

ఎమ్మెల్సీ ఎన్నికల్లో  విజయం కోసం చంద్రబాబు  ఇద్దరు  వైసీపీ  ఎమ్మెల్యేలను  కొనుగోలు  చేశారని  ఏపీ మంత్రి  రోజా  ఆరోపించారు.  

గన్నవరం:  చంద్రబాబు ఇంకా వైస్రాయ్  రాజకీయాలు  కొనసాగిస్తున్నారని  ఏపీ  రాష్ట్ర మంత్రి  రోజా  విమర్శించారు. శుక్రవారంనాడు గన్నవరంలో  మంత్రి  రోజా  మీడియాతో మాట్లాడారు.  జగన్ ను ఎవరు వ్యతిరేకిస్తే  వారికే  నష్టమన్నారు. కానీ జగన్ కు  ఏమీ కాదని మంత్రి  రోజా  చెప్పారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  చంద్రబాబు ఇద్దరు  ఎమ్మెల్యేలను కొన్నారని  రోజా  ఆరోపించారు. క్రాస్ ఓటింగ్  చేసిన ఎమ్మెల్యేల భవిష్యత్తు  ఏమిటో  త్వరలో తేలుతుందని మంత్రి  రోజా  తెలిపారు.  

ఎమ్మెల్సీ ఎన్నికల్లో  క్రాస్ ఓటింగ్ కు  పాల్పడింది ఎవరో మాకు తెలుసు, మీకు తెలుసునని  మంత్రి  రోజా  మీడియా ప్రతినిధులనుద్దేశించి వ్యాఖ్యానించారు.   క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలకు  పార్టీ టికెట్లు  ఇవ్వదని  కూడా  వాళ్లకు తెలుసునని మంత్రి రోజా  చెప్పారు. ఎమ్మెల్సీ  ఎన్నికలను  అవకాశంగా  తీసుకుని  ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయారని  మంత్రి  రోజా  ఆరోపించారు.  ప్రజల్లో అభిమానం, పేరు ప్రతిష్టలు ముఖ్యమనే విషయాన్ని డబ్బులకు అమ్ముడుపోయిన  ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని  రోజా  చెప్పారు. పార్టీకి  వ్యతిరేకంగా  క్రాస్ ఓటింగ్  కు పాల్పడిన  ఇద్దరు ఎమ్మెల్యేలు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని  మంత్రి రోజా అభిప్రాయపడ్డారు.

చంద్రబాబునాయుడు సీఎంగా  ఉన్న సమయంలో  23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు  చేసి  నలుగురిని  మంత్రులుగా  చేశారని  ఆమె  ఆరోపించారు.  చంద్రబాబు  నీతిమాలిన  రాజకీయం చేస్తే  అంతగా  ప్రజలు బుద్ది చెబుతారని  మంత్రి  రోజా  చెప్పారు.  గతంలో  23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు  చేస్తే  ప్రజలు టీడీపీని  23  స్థానాలకే  పరిమితం  చేశారన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో   ఇద్దరు ఎమ్మెల్యేలను టీడీపీ  కొనుగోలు  చేసిందని  మంత్రి  రోజా  ఆరోపించారు.  వచ్చే  ఎన్నికల్లో  టీడీపీకి  రెండు  ఎమ్మెల్యేలే దక్కనున్నాయని  మంత్రి  రోజా  చెప్పారు

click me!