
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా విషయమై వైసీపీ ఎంపీలు మంగళవారం నాడు ఆందోళనకు దిగారు. మంగళవారం నాడు రాజ్యసభ వాయిదా పడిన తర్వాత తిరిగి ప్రారంభమైంది. అయితే రాజ్యసభలో కరోనాపై చర్చకు రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు అంగీకరించారు. కరోనాపై ప్రధాని ప్రజెంటేషన్ కంటే ముందే చర్చకు వెంకయ్యనాయుడు అనుమతించారు. మధ్యాహ్నం 1 గంటకు కరోనాపై చర్చ ప్రారంభించే సమయంలో వైసీపీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదాపై నిరసనకు దిగారు. రాజ్యసభ వెల్‌లోకి వచ్చి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. నిరసనకు దిగిన ఎంపీలను తమ స్థానాల్లోకి వెళ్లాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ కోరారు.
also read:పెగాసెస్‌పై విపక్షాల ఆందోళన: ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయ సభల వాయిదా
కరోనాపై చర్చ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా విషయమై మరో పద్దతిలో చర్చిద్దామని ప్రభుత్వం తరపున పీయూష్ గోయల్ చెప్పారు.కరోనాపై చర్చను అడ్డుకోవద్దని ఆయన వైసీపీని కోరారు. కరోనా అందరిని ఆశ్చర్యాన్ని గురి చేసిందన్నారు. ముఖ్యమైన అంశంపై చర్చిస్తోంటే సభను అడ్డుకోవద్దన్నారు. కరోనాపై చర్చ సాగుతున్న సమయంలో ఆందోళనను విరమించుకోవాలని ఆయన వైసీపీ ఎంపీలకు సూచించారు.