రామచంద్రపై దాడి చేసింది టీడీపీ వ్యక్తే: ఎస్బీ స్పష్టీకరణ

By telugu teamFirst Published Sep 28, 2020, 4:59 PM IST
Highlights

జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి చేసింది టీడీపీ వ్యక్తి ప్రతాపరెడ్డి అని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పారు. ఈ ఘటనలో ఏ విధమైన రాజకీయం లేదని ఆయన స్పష్టం చేశారు.

చిత్తూరు: న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి మీద ఎస్పీ సెంథిల్ కుమార్ స్పందించారు. దాడికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులను విచారించామని ఆయన చెప్పారు. రామకృష్ణ సోదరుడు రామచంద్ర, ప్రతాప రెడ్డి పరస్పరం దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు. 

ప్రతాప రెడ్డి కూడా టీడీపీకి చెందినవారేనని ఆయన అన్నారు. దాడి ఘటనలో ఇనుప రాడ్లు వాడినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఎక్కడా లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కొందరు ఇలా చేస్తున్నారని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. ఈ కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిజీపీి రాసిన లేఖలోని అంశాలను విచారించినట్లు ఆయనయ తెలిపారు.

Also Read: జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి: ఏపీ డీజీపికి చంద్రబాబు లేఖ

నిందితుడు ప్రతాప రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. బి.కొత్తకోట ఘటనను రాజకీయం చేసిన తనను ఆభాసుపాలు చేశారని ఆయన అన్ారు. తన తల్లి టీడీపీ తరఫున ఎంపీటీసీగా నామినేషన్ వేశారని ఆయన చెప్పారు. జడ్జి రామకృష్ణ సంఘ విద్రోహ శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. 

సస్పెన్షన్ లో ఉన్న న్యాయమూర్తి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై ఆదివారం జరిగిన దాదడిలో రాజకీయ ప్రమేయం లేదని డీఎస్బీ రవి మనోహరాచారి చెప్పారు. దాడి ఘటనపై ఆయన ఆదివారం స్పష్టత ఇచ్చారు. పీటీఎం మండలం నారాయణపల్లెకు చెందిన భాస్కర్ రెడ్డి కుమారుడు ప్రతాప రెడ్డి దగ్గర బంధువు ఈ నెల 16వ తేదీన సూరపువారి పల్లెలో మృతి చెందాడని, అతని అంత్యక్రియలకు ప్రతాప రెడ్డి వెళ్లాడని ఆయన చెప్పారు. 

Also Read: జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి: వైసీపీ కార్యకర్తల పనేనంటున్న కుటుంబసభ్యులు

తిరిగి వస్తుండగా స్నేహితుడు కుమార్ రెడ్డి తనతో పాటు వస్తానని ప్రతాప రెడ్డిని కోరాడని దాంతో ప్రతాప రెడ్డి కుమార్ రెడ్డిని, మరో ఇద్దరిని తన కారులో ఎక్కించుకుని సూరపువారిపల్లెకు బయలుదేరాడని, ఆ సమయంలో రామచంద్ర బి. కొత్తకోట బస్టాండు వద్ద పండ్ల వ్యాపారి శ్రీనివాసులు వద్దకు వచ్చాడని తెలిపారు. తోపుడు బండి రోడ్డుకు అడ్డంగా ఉండడంతో దారి వదలాలని కారులో ప్రతాప రెడ్డి కోరాడని ఆయన చెప్పారు. 

అయితే, రామచంద్ర పండ్ల వ్యాపారికి వత్తాసు పలికాడని, దాంతో గొడవ జరిగిందని, రామచంద్ర గాయపడ్డారని ఆయన చెప్పారు. దాడి చేసిన ప్రతాప రెడ్డి గతంలో టీడీపీ తరఫున ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగిన శివమ్మ కుమారుడిగా తేలిందని ఆయన చెప్పారు. దాడిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.

click me!