
బాపట్ల : అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రతీ ఇంట్లోనూ నిత్యం ఉండేవే. కానీ, ఆ గొడవలు హద్దు మీరితే దారుణాలు జరుగుతాయి. అలాంటి ఓ దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో వెలుగు చూసింది. అటు తల్లికి సర్ది చెప్పలేక.. ఇటు భార్యకు సర్ది చెప్పుకోలేక…ఓ వ్యక్తి చివరికి కన్నతల్లినే కర్కషంగా హతమార్చాడు. అత్త కోడల మధ్య నిత్యం వివాదాలతో కొత్తిల్లు కట్టుకున్నా కూడా భార్య సంతోషంగా లేకపోవడం… అత్త ఇంట్లో ఉంటే తాను రానని హెచ్చరించడంతో ఈ తలపోటు భరించలేని భర్త ముసలి తల్లి అని కూడా చూడకుండా ఆమెని కర్కశంగా హతమార్చాడు.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రామకూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి రేణింగవరం ఎస్సై తిరుపతిరావు ఈ మేరకు వివరాలు తెలిపారు... ఓ వ్యక్తి 80యేళ్ల వయసు ఉన్న తన ముసలితల్లిని… భార్య పోరు పడలేక నీటి కుంటలో వేసి అంతం చేశాడు. కే సుబ్బులమ్మ (85).. కొడుకు శ్రీనివాసరావు కుటుంబంతో కలిసి రామకూరు గ్రామంలో ఉంటుంది. చాలా ఎళ్లుగా అత్తా కోడల మధ్యలో గొడవలు ఉన్నాయి.
తిరుమలలో చిరుతదాడి : బాలుడు కౌశిక్ క్షేమం.. ప్రాణాపాయం లేదు... ఈవో ధర్మారెడ్డి
ఇటీవల శ్రీనివాస రావు గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. రెండు రోజుల క్రితం గృహప్రవేశం కూడా అయింది. కొత్త ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకోవాల్సిన ఆయన భార్య మాత్రం అత్త ఆ ఇంట్లోకి అడుగుపెడితే తాను ఉండను అంటూ తెగేసి చెప్పేసింది. దీంతో శ్రీనివాసరావుకు ఏం చేయాలో పాలు పోలేదు. 85 ఏళ్ల ముసలి వయసు అన్న ఇంగితం మరిచిపోయాడు. మానవత్వం మరిచిపోయి తల్లిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.
ఈ క్రమంలో బుధవారం పొద్దుపోయిన తర్వాత తల్లిని టూ వీలర్ మీద కూర్చోబెట్టుకుని ఊరు చివరన ఉన్న చిన్నమ్మ కుంట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరూ చూడని సమయంలో.. తల్లిని అమాంతం నీటిలోకి నెట్టేశాడు. ఆ తర్వాత ఏమీ జరగనట్టుగా ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లారిన తర్వాత పశువుల కాపరులు కుంటలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు.. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. వారి దర్యాప్తులో కొడుకే ఈ దారుణానికి పాల్పడినట్లుగా తేలింది.